Manchu Manoj Chandrababu Naidu : పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు మనోజ్.. అందుకే బాబును కలిశామంటూ?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో మంచు మనోజ్( Hero Manchu Manoj ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మోహన్ బాబు తనయుడు గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

 Manchu Manoj Meets Chandrababu Naidu-TeluguStop.com

ప్రస్తుతం మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇటీవలే మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి( Bhuma Mounika Reddy )ని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇద్దరికీ కూడా అది రెండవ వివాహమే.ఇక పెళ్లి తర్వాత ఈ జంట పేర్లు తరచూ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.

Telugu Bhuma Mounika, Chandrababu, Manchu Manoj, Meet-Movie

ఏదో ఒక విషయంతో ఈ జంట వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా మంచు మనోజ్ దంపతులు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి( Former CM TDP Leader Chandrababu naidu )ని కలిశారు.సోమవారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి సతీ సమేతంగా వచ్చిన ఆయన దాదాపు 45 నిమిషాల పాటు కలిసి మాట్లాడారు.కుటుంబ వ్యవహారాలు, రాజకీయ అంశాలపై చంద్రబాబుతో మనోజ్ దంపతులు చర్చించినట్లు తెలుస్తోంది.

త్వరలో ఎన్నికల రాబోతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.అంతేకాకుండా మంచు మనోళ్లు దంపతులు చంద్రబాబుని కలవడంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu Bhuma Mounika, Chandrababu, Manchu Manoj, Meet-Movie

మనోజ్‌, మౌనిక రాజకీయ రంగ ప్రవేశం( Political Entry ) చేయబోతున్నారంటూ అప్పటి నుంచి వార్తలు వినిపించాయి.దాంతో ఆ వార్తలపై మంచు మనోజ్ స్పందించారు.ఈ సందర్భంగా మంచు మనోజ్‌ మాట్లాడుతూ.చంద్రబాబు మా కుటుంబానికి ఎంతో సన్నిహితులు.మేమంటే ఎంతో అభిమానం.భూమా మౌనికతో నా వివాహం తర్వాత ఆయన్ను కలవాలనుకున్నాము.

కానీ, కుదరలేదు.ఈలోగా బాబుగారు కూడా కాస్త బిజీ అయ్యారు.

నేను(చంద్రబాబు) హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం అని చెప్పారు.ఈ రోజు ఉదయం ఫోన్‌ చేసి రమ్మంటే, వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశాము.

మంగళవారం మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వచ్చి ఆశీస్సులు తీసుకున్నాము.రాజకీయాల్లోకి ప్రవేశంపై సందర్భం వచ్చినప్పుడు మౌనికనే చెబుతుంది అంటూ ఆ వార్తలకు పులిస్టాప్ పెట్టేశారు మంచు మనోజ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube