టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో అక్కినేని అఖిల్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.కానీ ఇప్పటి వరకు మంచి కమర్షియల్ హిట్ మాత్రం ఒక్కటి కూడా పడలేదు.
నటన, డాన్సులతో అదర గొడుతున్న ఒక్క హిట్ కూడా తన ఖాతాలో లేకపోవడంతో అక్కినేని అభిమానులు నిరాశ పడుతున్నారు.ప్రస్తుతం అఖిల్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.
త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అఖిల్ లోని మాస్ హీరోను బయటకు తీసి ప్రేక్షకులకు కొత్తగా చూపించేందుకు సురేందర్ రెడ్డి రెడీ అవుతున్నాడు.
ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
అయితే ఈ సినిమా లో విలన్ రోల్ కోసం సురేందర్ రెడ్డి ఒక స్టార్ హీరోను సిద్ధం చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అఖిల్ కు పోటీగా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కనిపించ బోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.
ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.