రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువ ఉండటంతో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.ప్రజలను సక్రమంగా పాలించాల్సిన పాలకులే మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా మధ్యప్రదేశ్లో బీజేపీ నాయకుడు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ దళిత మహిళలని నమ్మించి ఆమెను అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలో ఉన్నటువంటి అశోక్ నగర్ జిల్లాలో దేవేంద్ర తమ్రకర్ అనే వ్యక్తి బిజెపి పార్టీ మీడియా ఇన్ఛార్జిగా పని చేస్తున్నాడు.
ఇతడికి వ్యవసాయ క్షేత్రం కూడా ఉంది. ఈ వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్నటువంటి ఓ వ్యక్తి తన భార్యకు ఉద్యోగం ఇప్పించాలంటూ దేవేంద్రనీ సంప్రదించాడు.దీంతో ఆమె పై కన్నేసిన దేవేంద్ర ఎలాగైనా ఆమెను తీసుకోవాలి అనుకున్నాడు.అందుకు గాను తన స్నేహితులతో కలిసి పన్నాగం పన్నాడు.
ఇందులో భాగంగా తన వారణాసి వెళ్తున్నానని మార్గమధ్యంలో తన స్నేహితునికి సంబంధించిన ఓ మైనింగ్ కంపెనీ ఉందని అందులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వారిద్దరిని తీసుకెళ్లాడు.
అయితే భోజనం నిమిత్తమై మార్గం మధ్యలో ఓ హోటల్ దగ్గర వాహనాలను ఆపారు.ఆ తర్వాత ఆమె భర్తకి ఫుల్లుగా మద్యం తాగించి వేరే వాహనంలో ఎక్కించారు.దీంతో ఆమెను దేవేంద్ర తను ప్రయాణిస్తున్నటువంటి కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు.
ఆ తర్వాత ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా ఉండమని బెదిరించాడు. దీంతో ఆ మహిళ తన బంధువుల సహాయంతో పోలీసులను సంప్రదించి తనపై జరిగిన అఘాయిత్యం గురించి దేవేంద్ర పై ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవేంద్ర ని అరెస్ట్ చేశారు.తనని కావాలనే కాంగ్రెస్ నాయకులు కక్షగట్టి ఇలాంటి కేసులు ఇరికించారని తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని దేవేంద్ర అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించినటువంటి పలువురు కాంగ్రెస్ నాయకులు మాత్రం రాష్ట్రంలో ఇప్పటికే పలువురు నేతలు అత్యాచార కేసుల్లో జైలు పాలయ్యారని ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని అంటూ మోడీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు.
.