కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు మాధవన్( Madhavn ) తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ఈ మధ్యకాలంలో మాధవన్ చాలా తక్కువ సినిమాలను చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈయన చివరిగా నంబి నారాయణ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా ఆ సినిమాలో నంబి నారాయణ పాత్రలో నటించి మెప్పించారు.తాజాగా మరొక వెబ్ సిరీస్ ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మాధవన్ ద రైల్వే మెన్( The Railway Man ) అనే వెబ్ సిరీస్ లో నటించారు.ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి మాధవన్ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.ఇక ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటి జుహీ చావ్లా ( Juhi Chawla) కూడా నటించారు.
అయితే ఈమె గురించి ఈయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ వెబ్ సిరీస్ లో నాకు సంబంధించి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇందులో జుహీ చావ్లా బాగమయ్యారని ఈయన తెలియజేశారు.అయితే ఈమె 1988 లో నటించిన ఖయామత్ సే ఖయామత్ టక్( Qayamat Se Qayamat Tak ) సినిమా చూసి ఆమెకు ఫిదా అయ్యానని ఆ క్షణమే తనని పెళ్లి చేసుకోవాలి అనిపించిందని ఈయన తెలియజేశారు ఇలా ఈ విషయం మా అమ్మగారితో కూడా తాను చెప్పానని ఈ సందర్భంగా మాధవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.