ఏపీలో 2024 ఎన్నికల వాతావరణం వాడి వేడిగా ఉంది.ఈ క్రమంలో వచ్చే ఎన్నికల విషయంలో అభ్యర్థులకు సంబంధించి వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి.
ప్రతి నియోజకవర్గంలో సర్వేలు చేయించుకుని వాటి ఫలితాల ఆధారంగా అధ్యక్షుడు సీఎం జగన్( CM YS Jagan ) నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకత ఉన్న నాయకులను పక్కన పెట్టేస్తున్నారు.
ఇలా పక్కన పెట్టేస్తూ వైసీపీ ఇన్చార్జిల మార్పు పేరిట జాబితాలు విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేయగా నాలుగో జాబితా కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి( Machilipatnam MP Balashauri ). నేడు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.వైసీపీ ఇంఛార్జుల మార్పులతో మరోసారి సీటు దక్కడం కష్టమని భావించిన ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఆరుగురు ఎంపీ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేయడం జరిగింది.
ఎంపీ బాలశౌరి వైయస్ జగన్ కి అత్యంత సన్నిహితుడు.అయితే వచ్చే ఎన్నికలలో టికెట్ కి సంబంధించి పార్టీ అధిష్టానం నుండి సరైన స్పష్టత రాకపోవడంతో.
బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.