ఎన్టీఆర్ పై ఫ్యాన్స్ కు ఇంత అభిమానమా.. కొమురం భీం, దేవర రూపాలలో వినాయకుని విగ్రహాలతో?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) ను ఆయన ఫ్యాన్స్ ఏ స్థాయిలో అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తారక్ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లు ఊహించని రేంజ్ లో ఉంటాయి.

 Lord Ganapati Statues Goes Viral In Social Media Details Here , Lord Ganapati ,-TeluguStop.com

తన సినిమాలలో చాలా సినిమాలతో తారక్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశారు.సింహాద్రి, ఆర్.

ఆర్.ఆర్ సినిమాలతో తారక్ ఇండస్ట్రీ హిట్లను ఖాతాలో వేసుకున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో తారక్ మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంటే ఈ హీరో దూకుడుకు బ్రేకులు వేయలేమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానులు ఎంతగా అభిమానిస్తారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమంటూ తాజాగా ఒక ఘటన సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

కొమురం భీం, దేవర( Devara ) రూపాలలో పలు ప్రాంతాలలో వినాయకుని విగ్రహాలు( Ganesha statue ) దర్శనమిచ్చాయి.ఎన్టీఆర్ పై అభిమానంతో అభిమానులు ఈ విగ్రహాలను ఏర్పాటు చేసినట్టు సమాచారం అందుతోంది.

ఈ విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో పాటు ఆ ఫోటోలు తారక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా( Devara )తో మరో ఆరు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 60 శాతానికి పైగా షూట్ పూర్తైంది.ఇతర భాషల్లో సైతం తారక్ క్రేజ్, పాపులారిటీ అమాంతం పెరిగింది.

దేవర సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో భారీ ఆఫర్లు వస్తుండగా ఈ సినిమా తారక్ కోరుకున్న పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube