మొదటి రోజు సీఐడీ విచారణ అనంతరం లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

నేడు టీడీపీ యువనేత నారా లోకేష్( Nara Lokesh ) ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.సోమవారం రాత్రి ఢిల్లీ( Delhi ) నుండి విజయవాడకు చేరుకున్న ఆయన హైకోర్టు ఆదేశాలు మేరకు విచారణకు హాజరు కావడం జరిగింది.

 Lokesh Sensational Comments After The First Day Of Cid Investigation , Nara Loke-TeluguStop.com

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో లోకేష్ నీ 14వ నిందితునిగా చేర్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు.

విచారించవచ్చని ఆ సమయంలో లోకేష్ న్యాయవాదులు ఉండొచ్చని కోర్టు ఆదేశించింది.అయితే నేడు మొదటి రోజు సుమారు ఆరున్నర గంటల పాటు లోకేష్ నీ సీఐడీ విచారించింది.

విచారణ అనంతరం బయటకు వచ్చిన లోకేష్ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఇన్నర్ రింగ్ రోడ్డుతో( Inner Ring Road ) సంబంధం లేని ప్రశ్నలు అడిగినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా ఎల్లుండి మరోసారి విచారణకు హాజరవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.సీఐడీ నోటీసుల ప్రకారం నేడు విచారణకు హాజరైతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో సంబంధంలేని అనేక ప్రశ్నలు అడిగారు.

కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు నా ముందు పెట్టలేదు.మొత్తం 49 ప్రశ్నలు అడిగారు.అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేను నా కుటుంబ సభ్యులు ఎలా లాపబడ్డాము అనే దానికి సంబంధించి ఒక ప్రశ్న కూడా అడగలేదు.నేను ఆల్రెడీ చెప్పాను ఇది కక్ష సాధింపు.

ఎలాంటి ఆధారాలు లేని కేసుతో వైసీపీ ప్రభుత్వం దొంగ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తోంది అంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube