టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పీడ్ పెంచారు .తనను అదే పనిగా టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్న వైసీపీ కి, ఆ పార్టీలోని కొంతమంది కీలక నాయకులకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
వారి వ్యవహారాన్ని ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలని, వారు చేసే విమర్శలను చూసి చూడనట్లుగా వదిలేస్తే అది చేతగానితనంగా తీసుకుంటున్నారు అని లోకేష్ భావిస్తున్నారు.ముఖ్యంగా టిడిపిలో రాజకీయ జీవితం ప్రారంభించి, ఇప్పుడు వైసీపీ తరఫున వాయిస్ వినిపిస్తూ, తనను టార్గెట్ చేసుకున్న మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లకు చెక్ పెట్టే విధంగా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.
మీడియా, సోషల్ మీడియా ద్వారానే తన రాజకీయ ప్రత్యర్థులు పై ఘాటుగా విమర్శలు చేయాలని డిసైడ్ అయిపోయారు.అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై లోకేష్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారు.
నిన్న పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల తో మీటింగ్ నిర్వహించగా… ఆ మీటింగ్ లోకి ఆకస్మాత్తుగా వల్లభనేని వంశీ, కొడాలి నాని కొంతమంది వైసిపి నాయకులు అకస్మాత్తుగా ఎంట్రీ ఇవ్వడం పై లోకేష్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
జూమ్ మీటింగ్ అనంతరం సదరు వైసిపి నాయకులు మాట్లాడిన తీరు పైన టిడిపి నాయకులు మండిపడుతున్నారు.అసలు దొంగ ఐడీలతో టిడిపి మీటింగ్ లోకి హాజరు కావడం అనైతికమని, తమ నాయకుడు లోకేష్ ను విమర్శించే ముందు వైసిపి అసమర్ధతను దారిలో పెట్టుకోవాలంటూ లోకేష్ తో పాటు, ఆ పార్టీ నాయకులు విమర్శలు చేశారు.
ఇక ఈ సందర్భంగా ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతున్న అన్న క్యాంటీన్ కూల్చివేతకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతుండటంతో ,ఆ వ్యవహారాలపై ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలని లోకేష్ భావిస్తున్నారు.
మొన్న కుప్పంలో అన్న క్యాంటీన్ ఏర్పాటును పోలీసుల ద్వారా వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం… మంగళగిరిలో అన్నా క్యాంటీన్ ను కూల్చివేయడం తదితర అంశాలపై ఇక జనం లోకి వెళ్లి పోరాటం చేయాలని లోకేష్ భావిస్తున్నారు.నియోజకవర్గానికో ఒక అన్న క్యాంటీన్ టిడిపి తరఫున ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.వీటిని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైతే ఘాటుగా సమాధానం ఇవ్వాలని, ఈ అంశంపైనే ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయాలని లోకేష్ కొత్త టార్గెట్ విరమించుకున్నారట.