ఇవాళ 45 మంది అభ్యర్థుల జాబితా విడుదల..: మురళీధరన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ 45 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు మురళీధరన్ అన్నారు.వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

 List Of 45 Candidates Released Today..: Muralidharan-TeluguStop.com

సీపీఎంకు రెండు, సీపీఐకి రెండు సీట్లు ఇస్తున్నామని మురళీధరన్ స్పష్టం చేశారు.ఈ మేరకు కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయన్నారు.

ఏ స్థానాలు ఇవ్వాలన్న విషయంపై ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్న మురళీధరన్ ఒకటి రెండు రోజుల్లో పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుందని వెల్లడించారు.అదేవిధంగా మిగతా పదిహేను స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

కాగా ఇవాళ జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై నేతలు చర్చించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube