ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న హీరోయిన్ ప్రీతి జింటా.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ కూడా ముంబైలో( Mumbai ) పెద్ద ఎత్తున ఆస్తులను పోగు చేస్తున్నారు.ఇలా ముంబైలోని ఖరీదైన ప్రాంతాలలో కోట్లల్లో ఖర్చు చేసి ఇంటిని కొనుగోలు చేస్తూ భారీగా ఆస్తులు కూడా పెడుతున్నారు.

 Preity Zinta Buys Costly House In Mumbai Details, Preethi Zinta, New House, Mumb-TeluguStop.com

ఇప్పటికే ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలకు ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్లు ఉన్న విషయం మనకు తెలిసిందే.తాజాగా మరొకటి ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.

తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రీతి జింటా(Preity Zinta) ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశారంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.

Telugu Bollywood, Mumbai, Preethi Zinta, Preity Zinta, Preityzinta-Movie

ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ఈమె పెళ్లి చేసుకొని ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో( Los Angeles ) స్థిరపడ్డారు.ఈ దంపతులకు ఇద్దరు సంతానం అనే విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఈమె ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేశారని విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రీతి జింటా త్వరలోనే ముంబై( Mumbai ) వచ్చి ఇక్కడే సెటిల్ అవుతారని పలువురు భావిస్తున్నారు.

Telugu Bollywood, Mumbai, Preethi Zinta, Preity Zinta, Preityzinta-Movie

ముంబైలోని ఖరీదైన ప్రాంతాలలో ఒకటిగా పేరుగాంచిన బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో( Pali Hill ) ఖరీదైన లగ్జరీ ప్లాట్ (Luxary Flat) కొనుగోలు చేశారట. ప్రీతి.గతంలో ఆమె నివాసం ఉండే భవనంలోనే ఈ భవనం ఉన్నట్లు సమాచారం.

ఈ అందమైన  అపార్ట్‌మెంట్ 1,474 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.అలాగే ఈ ప్లాట్ కోసం. స్టాంప్ డ్యూటీ కింద  85.07 లక్షలు చెల్లించిందని తెలుస్తోంది.ఇక ఈమె కొనుగోలు చేసినటువంటి ఈ అపార్ట్మెంట్లోనే బాలీవుడ్ సెలబ్రిటీలు అయినటువంటి అజయ్ దేవగన్ కాజోల్ కూడా నివసిస్తున్నారని తెలుస్తుంది.ఈ ఫ్లాట్ కోసం ప్రీతిజింటా ఏకంగా 17 కోట్ల రూపాయలు చెల్లించారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube