లియో, భగవంత్ కేసరి, టైగర్.. మూడు సినిమాల వల్ల నిర్మాతలకు ఇంత లాభం వచ్చిందా?

దసరా పండుగ( Dasara Festival ) కానుకగా లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు థియేటర్లలో విడుదల కాగా ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ మూడు సినిమాలకు అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.

 Leo Bhagavanth Kesari Tiger Nageshwararao Movie Profits Details Here Goes Viral-TeluguStop.com

అయితే ఈ మూడు సినిమాలు ఇప్పటికే సేఫ్ కావడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari )కు 60 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా దాదాపుగా అన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది.

ఇకపై ఈ సినిమా సాధించే కలెక్షన్లు లాభాలుగానే పరిగణించాలి.130 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కినా నిర్మాతలకు ఈ సినిమా మంచి లాభాలనే అందించిందని సమాచారం అందుతోంది.ఈ సినిమా ఫుల్ రన్ లో 80 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను( Bhagavanth Kesari Collections ) సాధించే ఛాన్స్ అయితే ఉంది.

లియో సినిమా( Leo Movie ) విషయానికి వస్తే 16 కోట్ల రూపాయలకు ఈ సినిమా తెలుగు హక్కులు విక్రయించగా ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు నిర్మాతలకు 5 కోట్ల రూపాయల లాభాలను అందించింది.ఫుల్ రన్ లో ఈ సినిమా మరిన్ని లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.టైగర్ నాగేశ్వరరావు నాన్ థియేట్రికల్ హక్కులతోనే దాదాపుగా సేఫ్ అయింది.

చాలా ఏరియాలలో ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేసుకున్నారు.ఫుల్ రన్ లో ఈ మూడు సినిమాలు కలెక్షన్లతో సంబంధం లేకుండా వేర్వేరుగా 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమా( Tiger Nageswara Rao Collections )లలో మూడు సినిమాలు బాక్సాఫీస్ విజేతలే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.త్వరలో ఈ సినిమాల ఫుల్ రన్ కలెక్షన్ల గురించి క్లారిటీ రానుందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube