ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈరోజు మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.ఆగష్టు నెల 5వ తేదీన కరోనా బారిన పడ్డ బాలు వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆరోగ్యం క్షీణించి చనిపోయారు.40,000కు పైగా పాటలు పాడి గిన్నీస్ రికార్డును బాలు సొంతం చేసుకున్నారు.ఎస్పీ బాలు అంత్యక్రియలకు సంబంధించి మరికాసేపట్లో ప్రకటన చేస్తానని ఆయన కొడుకు చరణ్ వెల్లడించారు.
ఎస్పీ బాలు గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
మద్రాస్ లో ఇంజనీరింగ్ చదివే సమయంలో జాతీయ నాటక సంగీత పోటీలకు హాజరయ్యానని.ఆ సమయంలో కోదండపాణి తన పాట విని మర్యాదరామన్న సినిమాలో అవకాశం ఇచ్చాడని అన్నారు.
మర్యాదరామన్న సినిమాలో ‘‘ఏమి ఈ వింత మోహం’’ పాటతో గుర్తింపు వచ్చిందని చెప్పారు.
ప్రస్తుత కాలంలో గాయకులు, ఆర్టిస్టులు ఎక్కువ కావడంతో గాత్రం గుర్తు లేకుండా పోయిందని అన్నారు.
ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న గాయకులు సీనియర్ల దగ్గర పని చేస్తే పాట బాగుపడుతుందని చెప్పారు.ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలకు గౌరవం లేదని.
కులగజ్జి పెరిగిపోయిందని.కులాల పేర్లన్నీ బయటకు వచ్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.చాలామంది కొందరు గాయకులను తాను ఎదగనివ్వలేదని ఆరోపణలు చేశారని.తాను ఎవరికీ హాని చేయకపోయినా అలాంటి ఆరోపణలు రావడంతో బాధ పడ్డానని చెప్పారు.అమ్మాయి గృహిణి అని.అబ్బాయి బిజినెస్ మేనేజ్మెంట్ చేశాడని చెప్పారు.అమ్మాయికి, అబ్బాయికి కూడా కవల పిల్లలని తనను అందరూ కవలల తాతయ్య అని పిలిచేవారని అన్నారు.తనకు మిగిలిన కోరిక ఏమిటనే ప్రశ్నకు స్పందిస్తూ ఓపిక ఉన్నంతవరకూ పాటలు పాడుతూ ఉండాలని.
చావు అంటే తెలీకుండా కన్ను మూయాలని చెప్పారు.