చలికాలంలో పాలతో తయారుచేసిన జిలేబిని తినే అలవాటు మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు లేదు.పాలు విడిగా తాగి జిలేబిని వేరుగా తింటూ ఉంటారు.
ఆ రెండిటిని కలిపి తినడం వల్ల ఉన్న ప్రయోజనాలు మన తెలుగు ప్రజలకు తెలియదు కానీ మన దేశంలోని చాలా ప్రాంతాల్లో దూద్ జిలేబికి ఎంతో ప్రాధాన్యత ఉంది.వేడిపాలలో జిలేబిని ముంచుకుని తింటే ఎంతో ఆరోగ్యమని అది కూడా కచ్చితంగా చలికాలంలోనే తినాలని చెబుతున్నారు.
ఇలా దీన్ని తినడం వల్ల శరీరానికి వేడి అందుతుందని ఎంతోమంది నమ్మకం.కేవలం మనదేశంలోనే కాకుండా చాలా దేశాలలో ఈ ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు.
ఈ దూద్ జిలేబి గురించి మన పూర్వికులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.చక్కెరతో చేసిన పదార్థాలు మంచివి కావు అని కొంతమంది ప్రజలు భావిస్తారు.కనుక బెల్లం జిలేబిని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.చలికాలంలో వచ్చే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఇవి దూరం చేస్తుందని చాలామంది ప్రజల నమ్మకం.
వారి నమ్మకమే తరాలు మారుతూ వచ్చినా ఇప్పటికీ ఆచరణలో ఉండడం విశేషం.చలికాలంలో వచ్చే ఎన్నో రోగాలకు ఈ రెండిటి కాంబినేషన్ ఆరోగ్యానికి బాగా పనిచేస్తుందని చాలామంది ప్రజలు విశ్వసిస్తారు.
ఇక పాతకాలం నాటి నమ్మకాలు ఎలా ఉన్నా ఇప్పుడు వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.వారి అభిప్రాయం ప్రకారం చలికాలంలో జిలేబి పాలతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల మన శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్లపై ప్రభావంతంగా పనిచేసే అవకాశం ఉందని చెబుతున్నారు.దీనివల్ల ఒత్తిడి తగ్గిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంది.వీటి పాలతో జిలేబి తినడం వల్ల మైగ్రేన్ వంటి తలనొప్పులు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది.
బక్క పల్చగా ఉన్నవారు ఈ ఆహారాన్ని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.చక్కెరతో లేదా బెల్లంతో తయారు చేసిన తీపి పదార్థాలు తింటే ఆరోగ్యానికి చెడు జరిగే అవకాశం ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే మంచిది.