Ammo Okato Tareekhu : అమ్మో ఒకటో తారీఖు సినిమా ఫ్లాప్ కావడానికి కారణం ఇదే: LB శ్రీరామ్

హిలేరియస్ కమెడియన్ గానే కాకుండా మంచి రైటర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు ఎల్బీ శ్రీరామ్( LB sriram ).ఈ నటుడికి చాలా బాగుంది సినిమా తర్వాత బాగా గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా “అమ్మో ఒకటో తారీఖు” అని చెప్పవచ్చు.

 Ammo Okato Tareekhu : అమ్మో ఒకటో తారీఖు సిన-TeluguStop.com

ఈ సినిమాతో ఈ యాక్టర్ కి బాగానే గుర్తింపు వచ్చింది.కాకపోతే మూవీ ఫ్లాప్ అయ్యింది.

దాని గురించి ఎల్బీ శ్రీరామ్ తాజాగా మాట్లాడాడు.

Telugu Ammookato, Satyanarayan, Flop, Lb Sriram, Raasi, Srikanth, Tollywood-Movi

ఈ హాస్యనటుడు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.అందుకు తనకు నచ్చిన పాత్రలు రాకపోవడమే కారణమని అతనే తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు.అయినా ఖాళీగా ఉండలేక ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం కవి సామ్రాట్ అనే షార్ట్ ఫిలిం తీశాడు.

దీని ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటుడు మాట్లాడుతూ EVV సత్యనారాయణ( E.V.V.Satyanarayan ) డైరెక్టర్ చేసినా అమ్మో ఒకటో తారీఖు సినిమా గురించి చెప్పుకొచ్చాడు.ఈ మూవీ చాలా బాగున్నా.తనని కమెడియన్ గా కాకుండా ఒక సాడ్ క్యారెక్టర్ లో డైరెక్టర్ చూపించాడని, అది నచ్చక సినిమా ప్రేక్షకులు దానిని రిజెక్ట్ చేసి ఉంటారని అన్నాడు.

Telugu Ammookato, Satyanarayan, Flop, Lb Sriram, Raasi, Srikanth, Tollywood-Movi

ఎల్బీ శ్రీరామ్ “అమ్మో! ఒకటో తారీఖు” సినిమాకు ముందు జయం మనదేరా సినిమాలో యాక్ట్ చేశాడు.ఇందులో తాడి మట్టయ్యగా ఒక కామెడీ రోల్ చేసి బాగా మెప్పించాడు.అలా నవ్వులు పోయించిన ఎల్బీ శ్రీరామ్ అమ్మ ఒకటో తారీఖు సినిమాలో ఏడిపించే క్యారెక్టర్ చేశాడు.

ఆ పాత్రను ప్రేక్షకులు ఒప్పుకోలేకపోయారు.నిజానికి ఇవివి సత్యనారాయణ తనని ఎప్పుడూ ఇలాంటి మూస పాత్రలలోనే చూపించడానికి ఇష్టపడ్డాడని, తనకు కొత్త క్యారెక్టర్లు చేయాలని ఉన్నా అతని దగ్గరే ఇరుక్కుపోయానని కూడా ఎల్బీ శ్రీరామ్ కామెంట్స్ చేశాడు.

ఏదేమైనా ఈ హాస్యనటుడు ఆ తర్వాత చాలా విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగువారిని ఎంతగానో అలరించాడు.ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ వేసి తెలుగు వారికి ఎప్పటికీ గుర్తిండి పోయేలా నటించి మెప్పించాడు.

వాస్తు శాస్త్రజ్ఞుడిగా, కాలేజీ ప్రిన్సిపాల్ గా, చైన్ స్మోకర్‌గా, పూజారిగా, మ్యారేజ్ బ్రోకర్‌గా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాత్రలో ఎల్బీ శ్రీరామ్ ఒదిగిపోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube