Guntur Kaaram Vs Hanuman : ఇదీ అసలైన సక్సెస్.. గుంటూరు కారంను పాతాళంలోకి తొక్కేసిన హనుమాన్

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా హనుమాన్ సినిమా( Hanuman Movie ) పేరు మారుమోగిపోతోంది.ఈ సినిమా విడుదలకు ముందు చాలామంది ఈ సినిమా చిన్న సినిమా పెద్దగా థియేటర్లలో ఆడదు.

 Latest Colletions Guntur Kaaram And Hanuman Movies-TeluguStop.com

ఒక వారం రోజుల్లోనే ఓటీటీ లోకి వస్తుంది అంటూ చాలా నెగిటివ్ గా మాట్లాడారు.విడుదలకు ముందు అన్నింటికంటే చిన్న సినిమాగా కొందరు అభివర్ణించిన హనుమాన్ ఏకంగా సంక్రాంతి విజేతగా నిలిచే దిశగా అడుగులు వేస్తోంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

దీంతో అభిమానులు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.సినిమా విడుదల అయి వారం రోజులు దాటినా కూడా ఇంకా ఈ సినిమా మేనియా తగ్గడం లేదు.మరోవైపు గుంటూరు కారం సైంధవ్ సినిమా( Saindhav )లకు మిక్స్డ్ టాక్ రావడంతో హనుమాన్ టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది.

ఇప్పటికే హనుమాన్ సినిమా దాదాపుగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే.మొదట్లో పదుల సంఖ్యలో థియేటర్లలో విడుదలైన హనుమాన్ సినిమా ప్రస్తుతం వందల థియేటర్లలో ఆడుతోంది.

అని థియేటర్లలో కూడా ప్రస్తుతం హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

గుంటూరు కారం( Guntur Kaaram ), సైంధవ్, నా సామిరంగ సినిమాలకు మిక్స్డ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమాకు క్యూ కట్టడం మొదలుపెట్టారు.ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో హనుమాన్ సినిమా ఏ రేంజ్ లో దూసుకుపోతోంది అనడానికి ఒక సాక్ష్యం కనిపిస్తోంది.ఇంతకీ ఆ సాక్ష్యం ఏమిటంటే.376 లొకేషన్స్ లో విడుదల అయిన హనుమాన్ సినిమా 425,260 కలెక్షన్లను( Hanuman Movie Collections ) సాధించింది.ఇక 186 లోకేషన్స్ లో విడుదల అయిన గుంటూరు కారం సినిమా 41,977 కలెక్షన్లను సాధించింది.

ఇక ఎందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ అవ్వడంతో ఇది కదా అసలైన సక్సెస్ అంటే గుంటూరు కారం సినిమాను హనుమాన్ సినిమా పాతలానికి తొక్కేసింది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube