హీరోయిన్స్.అంటేనే అందగత్తెలు.
అలా అందంగా కనిపించడం కోసం వారు ఎన్ని కష్టాలు పడుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఏలాంటి సమస్య వచ్చిన సరే.వారి ఆహారంలో కొంచం కొవ్వు పదార్ధం కూడా వారు తీసుకోరు.వారి బాడీ ఫిట్నెస్ కోసం గంటలు గంటలు జిమ్ లో చమట చిందిస్తారు.
అలాంటి హీరోయిన్లు.ఫ్యాట్ ఫుడ్ ను తింటారా? కనీసం చూస్తారా? అలాంటిది.ఓ హీరోయిన్ మొత్తం ఫ్యాట్ ఫుడ్ నే తింటుంది.ఈ ఆహరం ఎంత రుచిగా ఉందొ అంటుంది.
ఎవరు అనుకుంటున్నారా? ఆమె ఎవరో కాదు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సరసన నేనొక్కడినే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కృతి సనన్.
బాలీవుడ్‌కు పరిమితం అయినా ఆమె.అక్కడ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.అయితే తాజాగా ఓ మరాఠి చిత్రం రీమేక్ లో నటిస్తున్న ఆమె ఆ సినిమాలో తొలుత నర్తకిగా నటించి చివరికి సరోగసి తల్లిగా కనిపించనుంది.
తల్లి పాత్రలో ఒదిగి పోవాలని డైట్ అంత పక్కన పెట్టి లావు అవ్వడానికి అహర్నిశలు కష్టపడుతుంది.
ఈ నేపథ్యంలోనే ఆమె ఉదయం ఎలాంటి ఆహారం తీసుకుంటుందో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే.
అది ఏంటి అంటే.పూరీ, శనగల కూర, హల్వా.
ఈ ఆహారాన్ని అందరూ తీసుకుంటారు.కానీ హీరోయిన్లు తీసుకోవడం అనేది ప్రస్తుతం ఆశ్చర్యకరమైన విషయం అనే చెప్పలి.
ఆలా తీసుకున్న ఆహారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా.నెటిజన్లు ఒకింత షాక్ కు గురై భారీ ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
దీంతో ప్రస్తుతం ఈ ఆహారం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.