సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ట్రెండ్ మారుతోంది అంటూ చెబుతూ ఉంటారు.ఇక ఇలా ట్రెండ్ మారడం అనేది కొంత మంది హీరోలతో సాధ్యమవుతోంది.
సినిమా ఇండస్ట్రీలోకి అందరిలాగానే హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత తమదైన శైలిలోరాణించి కొత్త ట్రెండ్ సృష్టించిన హీరోలు చాలామంది ఉన్నారు.ఇక అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు అని చెప్పాలి.
అప్పట్లోనే వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన భారీ బడ్జెట్ సినిమాల ట్రెండ్ ని టాలీవుడ్ లో మొదలుపెట్టారు.ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన సింహాసనం. ఇక ఈ సినిమాకి దాదాపు 3.50 కోట్ల వరకు అప్పట్లోనే ఖర్చు పెట్టారు.ఇక అప్పట్లో ఈ బడ్జెట్ చాలా ఎక్కువ అని చెప్పాలి.
అయితే ఇటీవలి కాలంలో మాత్రం వందల కోట్ల బడ్జెట్ అన్నప్పటికీ కూడా నిర్మాతలు ఎక్కడా వెనకడుగు వేయడం లేదు.ఇలా వందల కోట్ల బడ్జెట్తో విడుదలైన సినిమాలు అదే రీతిలో లాభాలను కూడా తెచ్చిపెడుతున్నాయి.కానీ ఒకప్పుడు 3.50 కోట్ల బడ్జెట్ అని తెలియడంతో ఏ నిర్మాత కూడా ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు రాలేదట.
దీంతో నిర్మాతలు కోసం వేచి చూడకుండా తానే నిర్మాతగా అవతారమెత్తి ఈ సినిమాను ముందుకు నడిపించారు సూపర్ స్టార్ కృష్ణ.
ఇక దర్శకులు ఎవరు కూడా తన ఊహకు సరిపడా లేకపోవడంతో తానే దర్శకత్వం వహించాలని అనుకున్నారు.1986లో భారీ బడ్జెట్ సినిమాగా విడుదలైన ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.ఊహించని రేంజ్ లోనే భారీ ఓపెనింగ్స్ కలెక్షన్స్ వచ్చాయి.
ఈ సినిమాకు బప్పీలహరి అందించిన సంగీతం ఎంతో ప్లస్ అయింది.ఇక బాలీవుడ్ నటి మందాకిని అందానికి తెలుగు ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యారు.
ఊహించినదానికంటే ఘన విజయం సాధించింది ఈ సినిమా.ఇక అత్యధిక వసూళ్ళు సాధించిన భారతీయ చిత్రంగా అప్పట్లో రికార్డు సృష్టించింది.
సింహాసన్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు.అక్కడ మంచి విజయాన్ని సాధించింది.
సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వంలో 3.50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 4.50 కోట్ల వసూళ్లు సాధించింది.ఇక ఇది ఇండస్ట్రీ రికార్డు అని చెప్పాలి.
ఇలా కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చి 40 కేంద్రాల్లో శత దినోత్సవం కూడా జరుపుకుంది ఈ సినిమా.ఈ సినిమాతో టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు పునాది పడింది.