చిన్నప్పటి నుంచి చదువును ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా కష్టపడితే మాత్రమే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు అయితే ఉంటాయి.నల్గొండ జిల్లా( Nalgonda District )లోని చండూరు మండలంలోని కొండాపురంకు చెందిన కొత్తపల్లి నర్సింహ( kottapalli narsimha ) కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన తీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది.
చిన్నప్పటి నుంచి కొత్తపల్లి నర్సింహ ఒకవైపు చదువుకుంటూ మరోవైపు వ్యవసాయ కూలి పనులు చేశారు.వ్యవసాయ కూలి పనుల వల్ల చదువుకు ఇబ్బందులు ఎదురైనా నర్సింహ మాత్రం చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.
తన ప్రతిభతో మొదట టీచర్ ఉద్యోగం సాధించిన నర్సింహ దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేసి గ్రూప్1 పోటీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే డీఎస్పీ ఉద్యోగం సాధించారు.కొత్తపల్లి నర్సింహ మాట్లాడుతూ 1998లో పదో తరగతి పూర్తైందని 2002లో టీచర్ ట్రైనింగ్ కోర్సును పూర్తి చేశానని అన్నారు.
అదే సంవత్సరం డీఎస్సీ రాసి జిల్లా స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించానని ఆయన చెప్పుకొచ్చారు.ఆ సమయంలో నాకు తేరట్ పల్లిలో టీచర్ జాబ్( Teacher job ) లభించిందని కొత్తపల్లి నర్సింహ చెప్పుకొచ్చారు.తొమ్మిదో తరగతి చదివే సమయంలో నాపై 50,000 రూపాయల అప్పుల భారం ఉందని ఆయన కామెంట్లు చేశారు.టీచర్ ఉద్యోగం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకున్నానని కొత్తపల్లి నర్సింహ పేర్కొన్నారు.
2001లో గ్రూప్1 లో డీఎస్పీగా ఎంపికయ్యానని ఆయన చెప్పుకొచ్చారు.ఆత్మ విశ్వాసంతో ముందడుగులు వేస్తే పోటీ పరీక్షలలో సక్సెస్ సాధించడం సులువేనని అన్నారు.సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకుంటే పోటీ పరీక్షలలో సక్సెస్ సాధించడం సులువేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొత్తపల్లి నర్సింహ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుండగా ఆయన కెరీర్ పరంగా ఎదిగిన తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
ఎంతో కష్టపడటం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని కొత్తపల్లి నర్సింహ చెబుతున్నారు.