మలయాళ సూపర్ హిట్ మూవీ నయట్టు( Nayattu ) ని గీతా ఆర్ట్స్ వారు తీసుకున్న వెంటనే చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.రెండేళ్లుగా ఈ సినిమా రీమేక్ గురించి తెలుగు మీడియా లో చర్చలు జరుగుతున్నాయి.
మొదట ఇతర నటీ నటులతో సినిమాను షూటింగ్ మొదలు పెట్టారు.కానీ కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ మధ్య లో ఆపేశారు.
కొత్తగా ఇతర నటీ నటులను తీసుకుని షూటింగ్ చేశారు. అల్లు అరవింద్( Allu Aravind ) ఏం చేసినా కూడా కచ్చితంగా పరమార్థం ఉంటుంది.
అందుకే తెలుగు ప్రేక్షకులు కోట బొమ్మాళి పీఎస్( Kotabommali P.S ) సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.శ్రీకాంత్, శివానీ రాజశేఖర్( Shivani Rajasekhar ) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ను బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాకు రంజిన్ రాజ్ మరియు మిథున్ ముకుందన్ లు సంగీతాన్ని అందించారు.ఈ సినిమా గురించి జనాలకు పెద్దగా తెలిసేది కాదు.కానీ ఎప్పుడైతే లింగి లింగి లింగిడి పాట ( Lingi Lingi Lingidi )విడుదల అయిందో అప్పటి నుంచి సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలు అయింది.
విడుదల అయినప్పటి నుంచి కూడా పాట యూట్యూబ్ లో సందడి చేస్తూనే ఉంది.ఓ రేంజ్ లో కాకుండా దూసుకు పోతోంది.భారీ వ్యూస్ ను రాబడుతోంది.వ్యూస్ విషయం పక్కన పెడితే ఎక్కడ చూసినా, విన్నా కూడా ఈ పాట ఉంది.
అందుకే ఈ సినిమా కు జనాల్లో మంచి క్రేజ్ లభించింది.పాట విన్న ప్రతి సారి కూడా ఈ సినిమా ఎలా ఉంటుందో , ఒక సారి చూడాలి అన్నట్లుగా నెటిజన్స్ మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే గీతా ఆర్ట్స్( Geetha Arts ) వారు పాట విజయంతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు.పెట్టిన పెట్టుబడికి ఏకంగా డబుల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ సినీ విశ్లేషకులు సైతం నోరు వెళ్లబెడుతున్నారు.సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలు కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమా ను నవంబర్ 24న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.