అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy ) తో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రెడ్డి వంగ అదే సినిమా ను హిందీ లో కబీర్ సింగ్ అంటూ రీమేక్ చేశాడు.తెలుగు మరియు హిందీ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఒకే సినిమా తో అక్కడ మరియు ఇక్కడ స్టార్ దర్శకుడిగా మారి పోయాడు.దాంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఇంకా ఇతర భాషల్లో కూడా ఈయనకు విపరీతమైన క్రేజ్ దక్కింది.
కబీర్ సింగ్ కారణంగా రణబీర్ కపూర్( Ranbir Kapoor ) తో యానిమల్ సినిమాను చేసే అవకాశం సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) కి దక్కింది.ఆ సినిమా ఫలితం పై చాలా నమ్మకంగా ఉన్నారు.
నిర్మాత విడుదలకు ముందే సందీప్ కి అయిదు కోట్ల రూపాయల విలువైన కారును బహుమానంగా ఇచ్చాడు అంటే ఆ సినిమా పై ఎంతగా ఆయనకు నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంతే కాకుండా ఆయన బ్యానర్ లో మరో రెండు మూడు సినిమా లు చేయాల్సిందిగా అడ్వాన్స్ లు కూడా ఇచ్చేస్తున్నాడు.ఇక సౌత్ లో ఇప్పటికే ప్రభాస్ తో స్పిరిట్ సినిమా( Spirit Movie ) ను సందీప్ రెడ్డి వంగ ప్రకటించాడు.ఆ సినిమా ఎప్పటి వరకు పట్టాలెక్కే అవకాశాలు ఉంది అనేది క్లారిటీ లేదు.
అయినా కూడా అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా ను సందీప్ వంగ ప్రకటించాడు.దాంతో ఈయన జోరు చూసి అంతా కూడా అవాక్కవుతున్నారు.
యానిమల్ సినిమా( Animal Movie )కు వస్తున్న క్రేజ్ నేపథ్యం లో బాలీవుడ్ హీరోలు కూడా సందీప్ దర్శకత్వం లో సినిమా ను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.షాహిద్ కపూర్( Shahid Kapoor ) తో మళ్లీ జత కట్టే అవకాశాలను సందీప్ వంగ పరిశీలిస్తున్నాడు.అంతే కాకుండా యానిమల్ సినిమా కు పార్ట్ 2 ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ఇక్కడ అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందీప్ వంగ ఫుల్ బిజీగా ఉన్నాడు.