కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్( Dhanush ) కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.కెప్టెన్ మిల్లర్( Captain Miller ) సినిమాతో ధనుష్ మరో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకోవడం జరిగింది.
ఈ సినిమా తమిళంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా తెలుగులో మాత్రం ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రాలేదు.అయితే ఒక హీరో మాత్రం ధనుష్ అండతో ఎదిగి ఇప్పుడు ధనుష్ కంటే ఎక్కువ మార్కెట్ ను సొంతం చేసుకున్నారు.
ధనుష్ హీరోగా తెరకెక్కిన 3 సినిమాలో ఆయనకు స్నేహితుడి పాత్రలో శివ కార్తికేయన్( Siva Karthikeyan ) నటించారు.ఆ తర్వాత కెరీర్ పరంగా విభిన్నమైన సినిమాలకు ఓటేసిన శివ కార్తికేయన్ తెలుగులో కూడా మార్కెట్ ను పెంచుకున్నారు.పక్కింటి కుర్రాడు తరహా పాత్రలలో ఎక్కువగా నటించడం వల్ల శివకార్తికేయన్ మార్కెట్ మరింత పెరిగింది.సంక్రాంతి పండుగ కానుకగా కెప్టెన్ మిల్లర్, అయలాన్( Ayalaan ) సినిమాలు విడుదలయ్యాయి.
రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో పైచేయి సాధించడం గమనార్హం.శివ కార్తికేయన్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.ప్రయోగాత్మక కథలకు ప్రాధాన్యత ఇస్తూనే ఆ కథలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే దిశగా అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.శివ కార్తికేయన్ రెమ్యునరేషన్( Siva Karthikeyan Remuneration ) కూడా భారీ రేంజ్ లో ఉంది.
అయలాన్ మూవీ తమిళంలో 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.అయలాన్ తెలుగు వెర్షన్ వేర్వేరు కారణాల వల్ల రిలీజ్ కాలేదు.ఒకవేళ తెలుగు వెర్షన్ విడుదలై ఉంటే మాత్రం ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగేవని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శివ కార్తికేయన్ భవిష్యత్తులో పాన్ ఇండియా హీరోగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.