భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త..అసలు కారణం ఏమిటంటే..?

ఇటీవలే కాలంలో దారుణమైన హత్యలు చేయడానికి పెద్ద కారణాలు అవసరం లేకుండా పోతోంది.చిన్న చిన్న మనస్పర్ధలు, ప్రవర్తన నచ్చకపోవడం లాంటి కారణాలకే దారుణాలకు పాల్పడి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతుంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

 Kolkata Man Kills Wife For Using Social Media Details, Kolkata ,kills Wife , Wif-TeluguStop.com

ఓ మహిళ సోషల్ మీడియాలో( Social Media ) ఎప్పుడూ యాక్టివ్ గా ఉండడం ఆమె భర్తకు నచ్చలేదు.దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలే.

భర్త క్షణికావేశంలో భార్య గొంతు కోసి హత్య చేసిన ఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.పశ్చిమబెంగాల్ లోని( West Bengal ) సౌత్ 24 పరగణాల జిల్లాలోని హరియణపూర్ లో పరిమల్, అపర్ణ బైద్య అనే దంపతులు నివాసం ఉంటున్నారు.

వీరికి ఒక కుమారుడు సంతానం.అపర్ణ బైద్య( Aparna Baidya ) తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.ఇది పరిమల్ కు నచ్చలేదు.ఈ విషయంలో ఈ దంపతుల మధ్య తరచూ గొడవలే.

Telugu Aparna Baidya, Kills, Kolkata, Parimal Baidya, Bengal-Latest News - Telug

ఎన్నిసార్లు చెప్పినా భార్య తన మాట వినకపోవడంతో పరిమల్( Parimal ) ఇంట్లో ఉండే కూరగాయలు కోసే కత్తితో భార్య గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు.కాసేపటి తర్వాత ఈ దంపతుల మైనర్ బాలుడు ఇంటికి వచ్చి చూసేసరికి అతని తల్లి రక్తపు మడుగులో కింద పడి ఉంది.వెంటనే ఆ బాలుడు పక్కింటి వారికి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

Telugu Aparna Baidya, Kills, Kolkata, Parimal Baidya, Bengal-Latest News - Telug

పోలీసులు ఆ మైనర్ బాలుడిని ఇంట్లో మీ అమ్మానాన్నలు ఎలా ఉండేవారని ప్రశ్నించగా.తన తండ్రి పరిమల్ ఎప్పుడు తన తల్లి అపర్ణ బైద్యతో గొడవ పడేవాడని, కత్తితో గొంతు కోసి చంపేస్తానని చాలాసార్లు బెదిరించేవాడని చెప్పాడు.

అపర్ణ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, సోషల్ మీడియా ద్వారా అపర్ణకు ఆన్లైన్ ఫ్రెండ్స్ ఏర్పడడం నచ్చని ఆమె భర్త పరిమల్ హత్య చేసి పరారయ్యాడని పోలీసులు నిర్ధారించారు.

కేసు నమోదు చేసుకుని పరిమల్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube