ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నాడు.బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్‌బేడీని ప్రకటించడాన్ని ఆయన ఆహ్వానించాడు.
ఇదో మంచి పరిణామంగా ఆయన పేర్కొన్నాడు.కిరణ్ బేడీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనతో బహిరంగ చర్చకు రావాలని కోరుతున్నాను.
ఆమె తనపై చేస్తున్న ఆరోపణలకు తాను సవివరంగా సమాధానం ఇస్తామని, తమ ప్రశ్నలకు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తాము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా కేజ్రీవాల్ కోరుతున్నాడు.ఏ వేదిక అయినా పర్వాలేదు, అన్ని చానెల్స్‌లో ఈ చర్చ కార్యక్రమం రావాలని ఆయన అన్నాడు.
హస్తిన ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్న కిరణ్ బేడీ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ సవాల్‌ను స్వీకరిస్తుందేమో చూడాలి.ఇక కిరణ్ బేడీ ట్విట్టర్ అకౌంట్‌ను అరవింద్ కేజ్రీవాల్ ఫాలో అవుతూ ఉంటాడు.
అయితే తాజాగా కిరణ్ బేడీ ట్విట్టర్‌లో కేజ్రీవాల్‌ను బ్లాక్ చేశారు.ఈ విషయంపై కూడా కేజ్రీవాల్ స్పందించాడు.
మీ ట్విట్టర్ అకౌంట్‌ను నేను ఫాలో అవుతూ ఉంటాను.అయితే ఇప్పుడేమో మీరు నన్ను బ్లాక్ చేశారు.
మిమ్ముల ఇప్పుడు కూడా నేను ఫాలో అవ్వాలనుకుంటున్నాను దయచేసి అన్ బ్లాక్ చేయడం అంటూ ట్వీట్ చేశాడు.అన్‌బ్లాక్ చేసేందుకు కిరణ్ బేడీ మాత్రం ససేమేర అంటోంది.