రిపబ్లిక్ డే సందర్బంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండియాలో పర్యటించనున్న విషయం తెల్సిందే.ఇప్పటికే ఈ టూర్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ఒబామా పర్యటన కోసం భారత్ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది.రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భాగంగా రాజ్‌పథ్‌లో ఒబామా హాజరు కానున్నాడు.
ఈ సందర్బంగా రాజ్‌పథ్‌ను నో ప్లేన్ జోన్‌గా ప్రకటించాలని అమెరికా ప్రభుత్వం భారత్‌ను కోరింది.అయితే ఇది వింత కోరిక అని, దీనికి తాము ఒప్పుకునేది లేదంటూ భారత్ స్పష్టం చేసింది.
రాజ్‌పథ్‌ను నో ప్లేన్ జోన్‌గా ప్రకటిస్తే ఆ సమయంలో పై నుండి విమానాలు వెళ్లే అవకాశం ఉండదు.అయితే ప్రభుత్వం మాత్రం ఆ రోజున యుద్ద విమానాల ప్రదర్శణ నిర్వహించాలని తలిచి అమెరికా అభ్యర్థనను తోసి పుచ్చినట్లుగా తెలుస్తోంది.
భారత ప్రభుత్వం తమ నిర్ణయం పేర్కొనడంతో అమెరికా కూడా పర్వాలేదన్నట్లుగా తెలుస్తోంది.అమెరికా అధ్యక్షుడు ఒబామా మొదటి సారి మోడీ ప్రధాని అయిన తర్వాత వస్తుండటంతో ప్రభుత్వ వర్గాలు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
భారత్, అమెరికాల మధ్య ఈ పర్యటన సన్నిహిత సంబంధాలను ఏర్పర్చే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.