బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నుంచి మనందరికీ తెలిసిందే.ఈమె బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా ఈ జంట 2012లో ఈ మూడు ముళ్ల బంధంతో ఒకటి అయింది.ఆ తర్వాత కరీనాకపూర్ 2016లో తొలిసారిగా థైమూర్ అలీ ఖాన్ కి జన్మనిచ్చింది.
ఆ తరువాత రెండవ బిడ్డగా జెహ్ జన్మించాడు.ఇది ఇలా ఉంటే కరీనా కపూర్ ప్రస్తుతం మూడవ బిడ్డకు జన్మనివ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
అంతేకాకుండా కరీనా కపూర్ గర్భం దాల్చినప్పటికీ షూటింగులకు మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదట.
నెలలు నిండే వరకు షూటింగ్లకు హాజరవుతూ, చిత్ర యూనిట్ తో కలిసి మెలిసి ప్రయాణం చేస్తూ,షూటింగ్ సెట్స్ లో జాగ్రత్తలు తీసుకునేదట.అంతేకాకుండా తగు జాగ్రత్తతో ముందుగానే అంబులెన్స్, డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచుకునేదట.
అప్పుడప్పుడు సెట్లో ఇబ్బందికరంగా అనిపించినా కూడా వెంటనే ప్రథమ చికిత్స తీసుకునేదట.అయితే కరీనాకపూర్ ఇద్దరు బిడ్డలు తల్లి అయినా కూడా ఆమె అందం ఏ మాత్రం చెక్కుచెదరడం లేదు.
పిల్లలు పుట్టకముందు ఎలా అయితే తన గ్లామర్ ఉందో పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదే గ్లామర్ ను కొనసాగిస్తోంది.
ఈ విషయంలో కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ ఆమెను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారట.పెళ్లి చేసుకున్నంత మాత్రాన వృత్తిని వదిలేసి కుటుంబ జీవితానికే అంకితమవ్వాల్సిన పనిలేదని వెన్ను తట్టి ప్రోత్సహించడంతోనే కరీనా ఇవన్నీ చేయగల్గుతుందట.మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో మూడవ బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటూ వస్తున్న వార్తలపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన రాలేదు.
ప్రస్తుతం కరీనా చేతినిండా బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి.అమీర్ ఖాన్ సరసన నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ప్రచార కార్యక్రామాలకు యూనిట్ రెడీ అవుతుంది.వాళ్లతో పాటు కరీనా కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది.
అయితే మరో కరీనా గర్భం సంగతి ప్రచారంలో అయిన బయటపడుతుందేమో చూడాలి మరి.