తెలంగాణ లో కన్నడ పాలి 'ట్రిక్స్'  ! రెండు పార్టీల మాటల యుద్ధం 

తెలంగాణలో కన్నడ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి.ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో( Karnataka assembly elections ) కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో,  తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం పెరిగింది.

 Kannada Pali 'tricks' In Telangana! A War Of Words Between The Two Parties, Karn-TeluguStop.com

ఇప్పటి వరకు బిఆర్ఎస్,  బిజెపిల( BRS, BJP ) మధ్యనే ప్రధాన పోటీ అన్నట్లుగా పరిస్థితి ఉన్నా, అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడం,  దీంతోపాటు,  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కర్ణాటకలో ఇచ్చిన ఎన్నికల హామీలను తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రకటించింది.కర్ణాటక తరహాలో గ్యారంటీలను తెలంగాణలో అమలు చేస్తామని జనాల్లోకి కాంగ్రెస్ వెళుతోంది.

కర్ణాటకలో అమలు చేస్తున్న పథకాలను తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటూ ఉండగా , దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను హైలైట్ చేస్తూ ప్రజల్లో కాంగ్రెస్ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది .

Telugu Dk Siva Kumar, Revanth Reddy, Siddaramayya, Telangana-Politics

 దీనికి తోడు కర్ణాటకలో రైతులు కాంగ్రెస్( Congress ) పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ,  తెలంగాణ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా,  దీనిని బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుంది.కొద్ది నెలల క్రితం వరకు తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ బిజెపిని టార్గెట్ చేసుకుని కేంద్ర ప్రభుత్వ విధానాలు , ప్రధాని మోదీ( Prime Minister Modi ) వైఫల్యాలను హైలెట్ చేస్తూ  వచ్చినా, కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత కాంగ్రెస్ బలోపేతం కావడంతో,  ఆ పార్టీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంది.  బిఆర్ఎస్ కు మళ్ళీ అధికారం దక్కకుండా కర్ణాటక లో ఇచ్చిన ఎన్నికల హామీలనే తెలంగాణ కాంగ్రెస్ నమ్ముకోవడం, వాటినే ప్రచారం చేస్తుండడంతో బీఆర్ఎస్ కూడా రూటు మార్చి కర్ణాటక ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి తీసుకు వెళ్తూ , కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ లో ప్రజలకు కష్టాలు తప్పవని,  దీనికి కర్ణాటకలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ వాడుకుంటుంది.

కాంగ్రెస్ ప్రకటించిన ప్రధాన హామీలైన ఆరు గ్యారెంటీలను  తెలంగాణ కాంగ్రెస్ జనాల్లోకి తీసుకువెళుతోంది.ముఖ్యంగా 500 కే గ్యాస్ సిలిండర్ అందించే మహాలక్ష్మి పథకం,  రైతులకు ఎకరానికి 15,000 అందించే రైతు భరోసా , ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందించే గృహ జ్యోతి,  పేదలకు గృహ వసతి కల్పించే ఇందిరమ్మ ఇంటి పథకం,  విద్యార్థులకు 5 లక్షల విద్య భరోసా కార్డు,  నెలవారి పెన్షన్ తో కూడిన చేయూత ఇలా ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది .కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడ 5 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించగా,  తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.

Telugu Dk Siva Kumar, Revanth Reddy, Siddaramayya, Telangana-Politics

దీనికి తోడు కర్ణాటక కాంగ్రెస్ కీలక నేతలను తెలంగాణ ఎన్నికల ప్రచారానికి తీసుకువచ్చి వారితోనే కాంగ్రెస్ హామీలను ప్రచారం చేయిస్తోంది.ముఖ్యంగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ , సీఎం సిద్ధిరామయ్య( DK Shivakumar, CM Siddiramaiah ) వంటి వారిని ఎన్నికల ప్రచారంలోకి తీసుకువచ్చి మరింత ఊపు తీసుకొచ్చారు.దీంతో బిఆర్ఎస్ కూడా అలెర్ట్ అయ్యింది.

కర్ణాటక రాజకీయాలను తెలంగాణలో తిప్పుకొట్టే ప్రయత్నం మొదలు పెట్టింది .కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక హామీలను విస్మరించిందని,  ముఖ్యంగా రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేసే విధంగా బీఆర్ఎస్ ప్రయత్నిస్తూ, కాంగ్రెస్ ఎత్తుగడలను తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube