అమెరికా విదేశాంగ శాఖలో భారత సంతతి మహిళకు కీలక పదవి.. ప్రమాణ స్వీకారం చేయించిన కమలా హారిస్

భారతీయ అమెరికన్ మహిళ గీతా రావు గుప్తా( Geeta Rao Gupta ) యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లోని గ్లోబల్ ఉమెన్స్ ఇష్యూస్ కార్యాలయానికి ‘‘ అంబాసిడర్ ఎట్ లార్జ్‌ ’’గా( Ambassador-at-Large ) ప్రమాణ స్వీకారం చేశారు.అంతేకాదు .

 Kamala Harris Ceremonially Swore In Geeta Rao Gupta As Ambassador-at-large For G-TeluguStop.com

ఈ పదవికి ఎంపికైన తొలి శ్వేతజాతీయేతర మహిళగా నిలిచారు.సోమవారం జరిగిన కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్( Kamala Harris ) ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి గీత భర్త అరవింద్ గుప్తా, కుమార్తె నయన గుప్తా, కోడలు మంజులీ మహేశ్వరి, స్నేహితురాలు కరోలినా రోజస్ హాజరయ్యారు.

గీతా రావు నియామకాన్ని మే నెలలో యూఎస్ సెనేట్‌ 51 – 47 ఓట్ల తేడాతో ధ్రువీకరించిన సంగతి తెలిసిందే.

గీతా రావు ప్రకారం.ప్రపంచవ్యాప్తంగా మహళలు ఎన్నో అసమానతలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు.

భద్రత విషయంలో ఎన్నో బెదిరింపులకు గురవ్వడంతో పాటు హింసకు కూడా స్త్రీలు భయపడుతున్నారని గీత ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Ambassador, Arvind Gupta, Geeta Rao Gupta, Womens, Indianamerican, Kamala

ఇకపోతే.మహారాష్ట్రలోని ముంబైలో( Mumbai ) పుట్టారు గీతా.ముంబై, ఢిల్లీలలో ఆమె పెరిగారు.

యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెంగళూరు యూనివర్సిటీల్లో గీతా రావు విద్యాభ్యాసం చేశారు.బెంగళూరు యూనివర్సిటీ నుంచి సోషల్ సైకాలజీలో ఆమె పీహెచ్‌డీ చేశారు.

అనంతరం పలు విశ్వవిద్యాలయాల్లోని సైకాలజీ విభాగాల్లో పనిచేశారు.టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో పనిచేస్తుప్పుడు దేశంలోనే తొలిసారిగా ఉమెన్స్ స్టడీస్ కారిక్యులమ్‌ను గ్రాడ్యుయేట్ విద్యార్ధుల కోసం ప్రవేశపెట్టడంలో గీత కీలకపాత్ర పోషించారు.1980ల ప్రాంతంలో అమెరికాకు వెళ్లిన గీతా రావు.ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ (ఐసీఆర్‌డబ్ల్యూ)లో చేరి పలు హోదాల్లో పనిచేశారు.

Telugu Ambassador, Arvind Gupta, Geeta Rao Gupta, Womens, Indianamerican, Kamala

తన నియామకంపై సెనేట్‌లో చర్చ సందర్భంగా గీతా రావు మాట్లాడుతూ.కెరీర్‌ను కొనసాగించడంలో మహిళలు ఎదుర్కొనే అడ్డంకులను తాను అర్దం చేసుకున్నానని చెప్పారు.ఈ అంశంపై భారతదేశంలో తన డాక్టోరల్ పరిశోధన చేశానని గీతా రావు వెల్లడించారు.ఈ అంశాలే మహిళలు అనుభవించే అసమానతలను సరిదిద్దడంపై దృష్టి సారించే వృత్తి వైపు తనను నడిపించాయని ఆమె చట్టసభ సభ్యులకు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube