మొక్కజొన్న( Maize ) రెండు తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న పంటలలో ఒకటి.ఇది కేవలం ఆహార పంటగా మాత్రమే కాదు వివిధ పరిశ్రమలలో ముడి సరుకు గాను, పశువులకు దాణగాను ఉపయోగిస్తూ ఉండడంతో చాలామంది రైతులు ( Farmers ) మొక్కజొన్న పండించడానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
మొక్కజొన్న పంటను ఎలా సాగు చేయాలో.మొక్క జొన్న పంటను ఆశించే కాండం తొలిచే చారల పురుగులను( Stemborer ) ఎలా అరికట్టాలో చూద్దాం.

మొక్కజొన్న పంటకు రేగడి, గరప, ఇసుక, మధ్యరకపు రేగడి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.నేల యొక్క పీహెచ్ విలువ 6.5 నుంచి 7.5 ఉండే నేలలలో అధిక దిగుబడి పొందవచ్చు.ఒక ఎకరం పొలనికి ఐదు కిలోల విత్తనాలు అవసరం.మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం, సాళ్ల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.పొలంలో బోదేసాళ్లు ఏర్పాటు చేసుకుంటే నీటిపారుదలకు మరియు అధిక నీరు పొలంలో నిల్వ ఉండకుండా పంట పెరుగుదల బాగా ఉంటుంది.పొలంలో ఎప్పటికప్పుడు కలుపును నివారించాలి.

అధిక ఆదాయం పొందాలంటే మొక్కజొన్న సాళ్ల మధ్యలో కంది లేదా కూరగాయలను సాగు చేసుకోవచ్చు.రాజన్న పంట చేతికి వచ్చాక, వేరుశనగ లేదా పొద్దు తిరుగుడు లాంటి పంటలను పండించవచ్చు.మొక్కజొన్న పంట( Maize Crop ) కంకిదశకు చేరుతున్న సమయంలో కాండం తొలిచే చారల పురుగులు పంటను ఆశిస్తాయి.ఖరీఫ్ లో ఎక్కువగా ఈ పురుగుల బెడద ఉంటుంది.
మొక్క లోపలికి చొచ్చుకొని వెళ్లి కాండానికి ఆకులకు గుండ్రని రంధ్రాలు చేసి రసాన్ని పీల్చేస్తాయి.ఇవి ఆకులని, కాండాన్ని ,పూతని, కంకిని ఆశించడంతో తీవ్ర నష్టం కలుగుతుంది.
రసాయన పిచికారి మందులు చాలా రకాలు ఉండడంతో ఆ పురుగులను వ్యవసాయ క్షేత్ర నిపుణులకు చూపించి వారి సలహాతో రసాయన పిచికారి మందులను ఉపయోగించి ఈ పురుగులను సకాలంలో అరికడితేనే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.







