ఈ మధ్య చాలామంది సెలబ్రెటీలు ఆన్లైన్ గేమ్స్, ఇతర ప్రొడక్ట్స్ గురించి బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు.నిజానికి ఆన్లైన్ గేమ్స్ లాంటివి ప్రమోట్ ( Promotions ) చేయటం వల్ల వారికి కచ్చితంగా విమర్శలు ఎదురవుతూ ఉంటాయి.
అంతేకాకుండా డబ్బు కోసం అనవసరమైన ప్రొడక్ట్స్ ను కూడా ప్రమోట్ చేయడం వల్ల బాగా నెగటివ్ కామెంట్లు ఎదుర్కొంటూ ఉంటారు.నిజానికి తాము ఏదైతే ప్రమోట్ చేస్తారో వాటిని అసలు వాడరు.
కానీ జనాలకు మాత్రం ఆ ప్రోడక్ట్ గురించి తెగ గొప్పగా చెబుతూ ఉంటారు.అందుకే జనాలు వారిని బాగా ఏకీపారేస్తూ ఉంటారు.అయితే తాజాగా యాంకర్ శివ జ్యోతి( Anchor Shiva Jyoti ) విషయంలో కూడా అలాగే ఫైర్ అవుతున్నారు.
వి6 ఛానల్ ద్వారా తీన్మార్ సావిత్రిగా( Teenmar Savitri ) పరిచయమైన శివ జ్యోతి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తన భాష తీరుతో, తన చీర కట్టుతో అందరినీ ఆకట్టుకుంది.దీంతో ఈమెకు తీన్మార్ వార్తల ద్వారా తెలుగు రాష్ట్రాలలో మంచి అభిమానం ఏర్పడింది.అయితే ఆ హోదాతో ఈమెకు బిగ్ బాస్ లో ( Bigg Boss )కూడా అవకాశం వచ్చింది.
ఇక షో నుండి బయటికి వచ్చాక వి6 వదిలేసి మరో ఛానల్ లో అడుగు పెట్టింది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా మారింది.యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో బాగా వీడియోస్ షేర్ చేస్తుంది.అయితే ఈమధ్య తను గ్లామర్ షో చేయడం కూడా మొదలుపెట్టింది.నిజానికి ఈమె తెలంగాణకు చెందిన అచ్చమైన తెలుగు అమ్మాయి.

చెప్పాలంటే పద్ధతిగా ఉండాల్సిన అమ్మాయి అని అర్థం.కానీ ఈ మధ్య ఈమె కూడా గ్లామర్ షో చేయడం మొదలుపెట్టింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.చాలాసార్లు ఈమె వేసుకున్న దుస్తుల పట్ల ఈమెకు ట్రోల్స్ కూడా వచ్చాయి.
చాలా మారిపోయావు.ఒకప్పుడు చాలా పద్ధతిగా ఉండే దానివి అంటూ చాలామంది కామెంట్లు కూడా పెట్టారు.

అయినా కూడా వాటిని పట్టించుకోకుండా అలాగే తయారయ్యింది శివ జ్యోతి. ఇక యూట్యూబ్లో కూడా మంది ముచ్చట్లు అంటూ కొన్ని రోజులు బాగా హల్చల్ చేసింది.ఎక్కువ షాపింగ్ మాల్ వీడియోస్ చేస్తూ ఆ బ్రాండ్లను ( Brands ) బాగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే ఈమధ్య కొన్ని చిన్న చిన్న ప్రొడక్ట్స్ గురించి కూడా ప్రమోట్ చేస్తుంది.

అయితే తాజాగా తన ఇన్ స్టాల్ లో ఒక వీడియో పంచుకుంది.అందులో తను 30 రూపాయలకు వచ్చే ఇండికా హెయిర్ కలర్( Indica Hair Color ) గురించి ప్రమోట్ చేసింది.దీంతో జనాలు ఆమెను బాగా ఏకీపరిస్తున్నారు.వేలకు వేలు పెట్టి మీరు బ్యూటీ పార్లర్ లో మంచి ప్రొడక్ట్స్ వాడి జనాలకు ఇటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ గురించి చెబుతారా అంటూ ఫైర్ అవ్వగా మరి కొంతమంది.
ఇన్నాళ్లకు నువ్వు ముసలి దానివని ఒప్పుకున్నావు.అంటే నువ్వు కూడా కలర్ వేసుకునే బ్యాచ్ అని.డబ్బు కోసం ఇటువంటివి కూడా చేస్తున్నావా అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.







