సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Director Lokesh Kanakaraj ) అంటే ఇప్పుడు పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఫేమస్ అనే చెప్పాలి.ఈయన ఒకప్పుడు కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయిన ఇతడి క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో పెరిగింది.
కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీసిన తర్వాత ఈయన అంటే అందరికి సుపరిచితం అయ్యింది.ఈ సినిమా తర్వాత చేస్తున్న సినిమాలను తన యూనివర్స్ లో భాగం చేస్తూ వస్తున్నాడు.
లోకేష్ తన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేసిన విషయం తెలిసిందే.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ‘తలైవర్ 171’( Thalaivar 171 ) ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా ప్రకటించారు.ఇటీవలే జైలర్ సినిమాతో కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజినీకాంత్ వెంటనే లోకేష్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రకటించాడు.
అయితే తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.ఇందులో లోకనాయకుడు కమల్ హాసన్( Kamal Haasan ) కూడా భాగం అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.విక్రమ్ సినిమాలో కమల్ క్యారెక్టర్ ను రజినీకాంత్ సినిమాలో కంటిన్యూ చేస్తారన్న టాక్ వైరల్ అవుతుంది.
మరి ఈ సినిమాలో విక్రమ్( Vikram ) క్యారెక్టర్ ను చూపిస్తే ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉంటుంది అనే చెప్పాలి.కమల్, రజినీకాంత్ బిగ్ స్టార్స్ గా అవతరించిన తర్వాత కలిసి నటించలేదు.
దీంతో ఈ కాంబోను లోకేష్ సెట్ చేస్తే కనుక రికార్డులు వేట మొదలు పెట్టడం ఖాయం.మరి వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.
ఇక ఈ ప్రాజెక్ట్ కు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు.అలాగే ఈ సినిమాకు యాక్షన్ డైరెక్టర్లు గా అన్బు అరివ్ వ్యవహరించనున్నారు.