Kalyan Ram: తండ్రి కారణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకున్న కళ్యాణ్ రామ్.. అమ్మాయి ఎవరంటే..?

బింబిసార (Bimbisara) సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలో కంబ్యాక్ అయిన కళ్యాణ్ రామ్( Kalyan Ram ) ప్రస్తుతం డెవిల్ సినిమాతో( Devil Movie ) మన ముందుకు రాబోతున్నారు.బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత వచ్చిన అమిగోస్ అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ డెవిల్ సినిమాతో మళ్లీ అందరి అంచనాలను అందుకోబోతున్నారు.

 Kalyan Ram Who Gave Up The Girl He Loved Because Of His Father-TeluguStop.com

ఇక త్వరలోనే బింబిసార 2 కూడా ఉంటుందని ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఒకానొక సమయంలో వరుస ప్లాఫులతో ఉన్న కళ్యాణ్ రామ్ కి అండగా నిలిచింది జూనియర్ ఎన్టీఆర్.

ప్రస్తుతం ఎన్టీఆర్ ని బాలకృష్ణ (Balakrishna) ఫ్యామిలీ దూరం పెట్టినప్పటికీ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లు మాత్రం చాలా అన్యోన్యంగా ఉంటున్నారు.

ఈ విషయం పక్కన పెడితే.

కళ్యాణ్ రామ్ తన తండ్రి కారణంగా ఎంతో గాఢంగా ప్రేమించిన ఆ హీరోయిన్ ని వదులుకోవాల్సి వచ్చిందట.ఇక అసలు విషయంలోకి వెళ్తే.

నందమూరి కళ్యాణ్ రామ్ తాత ఎన్టీ రామారావు (Nt.Ramarao) నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని బాలగోపాలుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు.ఆ తర్వాత తొలిచూపులోనే, అభిమన్యు అనే రెండు సినిమాలతో ఒకేసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.ఇక ఇప్పటివరకు ఈయన చేసిన చాలా సినిమాల్లో కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి.

Telugu Balakrishna, Bimbisara, Devil, Jr Ntr, Kalyan Ram, Kalyanram, Nandamurika

అయితే అలాంటి కళ్యాణ్ రామ్ తన సినిమాలో చేసిన ఓ హీరోయిన్ తో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారట.అంతేకాదు కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఆ హీరోయిన్ తో కలిసి షూటింగ్ అయిపోయి వేరే సినిమా షూటింగ్ చేస్తున్నా కూడా ఆమెను వదిలిపెట్టలేక ఆమెను వెంట పెట్టుకొని ఎక్కడికి పడితే అక్కడికి తిరిగే వారట.ఇక ఈ విషయం ఇండస్ట్రీలో ఉండే కొంతమంది నుండి తెలుసుకున్న హరికృష్ణ( Harikrishna ) ఆ హీరోయిన్ బ్యాగ్రౌండ్ తెలుసుకొని కళ్యాణ్ రామ్ ని ఇంటికి పిలిపించి వార్నింగ్ ఇచ్చారట.

Telugu Balakrishna, Bimbisara, Devil, Jr Ntr, Kalyan Ram, Kalyanram, Nandamurika

అంతే కాదు ఇంకొకసారి ఆ అమ్మాయితో తిరిగితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మొహం మీదే చెప్పారట.దాంతో కళ్యాణ్ రామ్ తండ్రి మాట కాదనలేక ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆ హీరోయిన్ కి బ్రేకప్ చెప్పి సినిమాలపై తన దృష్టి మరల్చారు.అలాగే 2006లో ఇంట్లో వాళ్ళు చూసిన స్వాతి (Swathi) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

ఇక వీరిద్దరికి ఒక కూతురు, కొడుకు కూడా ఉన్నారు.ఇలా తండ్రి మీద ఉండే ప్రేమతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కూడా కళ్యాణ్ రామ్ వదులుకున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube