16 ఏళ్లకే సంపాదించడం మొదలు పెట్టిన కాజల్ అగర్వాల్

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటి కాజల్ అగర్వాల్ ఈ అమ్మడు ఇందాస్త్రీలోకి అడుగుపెట్టి 12 ఏళ్ళు దాటిపోయిన ఇప్పటికి తన హవా కొనసాగిస్తుంది.స్టార్ హీరోల సినిమాలకి ఫస్ట్ ఛాయస్ గా కాజల్ అగర్వాల్ మారిపోయింది.

 Kajal Agarwal First Income Started From 16 Years Age, Tollywood Heroines, Celebr-TeluguStop.com

ప్రస్తుతం ఈ అమ్మడు కమల్ హసన్ కి జోడీ గా భారతీయుడు సీక్వెల్ లో నటిస్తుంది.ఇదిలా ఉంటే ఇక కరోనా కారణంగా ఇంటి దగ్గరనే ఉంటున్న అందాల భామలు వారి జీవితం గురించి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు.

వీటిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా చెబుతున్నారు.ఈ నేపధ్యంలోనే కాజల్ అగర్వాల్ కూడా తాజాగా అభిమానులతో ముచ్చటిస్తూ తాను టీనేజ్ వయసు నుంచే సంపాదించడం మొదలు పెట్టినట్లు ఆసక్తికరమైన విషయం వెల్లడించింది.

చిన్నప్పటినుండి పిల్లలు ఏమవ్వాలనే లక్ష్యం ఉంటుంది.దానికి ఓ స్పష్టత ఉంటుంది.అయితే ఫ్యూచ‌ర్‌లో వాళ్ళు అదే చేస్తారా లేదా అనేది తెలియదు.అలాగే నేను చిన్నప్పుడు ఒకలా అనుకునే దాన్ని కానీ తర్వాత చాలా గందరగోళానికి గురయ్యే దానిని అలాంటి పరిస్థితి నుండే నాకో ఆలోచన వచ్చింది.

అసలు నేను ఎలాంటి పని చేస్తే నా మనసుకి నచ్చుతుంది తెలుసుకోవడానికి ఏదో ఒక పని చెయ్యాలని డిసైడ్ అయ్యాను.ముందుగా యాడ్స్ ఏజెన్సీలో చేరాను .అప్పుడు నా వయస్సు 16 ఏళ్ళు.అప్పటి నుంచే సంపాదించడం నేర్చుకున్నాను.

కాలేజ్‌కి వెళ్లిన వేసవి సెలవుల్లో ఏదో ఒక ఉద్యోగం వెతుక్కునేదాన్ని.నేను ఏ పనిని బాగా ఇష్టపడతానో తెలుసుకోవడానికే అలా ఉద్యోగాలు చేసేదాన్ని.

డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో రియల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో చేరాను.అందులో దాదాపుగా పది నెలలు పని చేశాను.

ఇక ఎంబీఏలో ఉండగా సినిమాల్లో అవకాశాలు రావడం తర్వాత హీరోయిన్‌గా స్థిరపడడం జరిగింది.అయితే నేను ఎన్ని ఉద్యోగాలు చేసిన రాని సంతృప్తి నటిగా కెరియర్ మొదలు పెట్టిన తర్వాత వచ్చింది.

ఇలా ఈ రంగంలో ఫైనల్ గా సెటిల్ అయ్యా అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube