టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు హిట్ సినిమాలకు మాటల రచయితగా, కథా రచయితగా పని చేసిన వాళ్లలో కొరటాల శివ ఒకరనే సంగతి తెలిసిందే.దర్శకునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కొరటాల శివ మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు.
అయితే ఆచార్య సినిమా కొరటాల శివ సినీ కెరీర్ లో తొలి డిజాస్టర్ గా నిలిచింది.
వాస్తవానికి ఆచార్య సినిమా షూటింగ్ మొదలయ్యే సమయానికి షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి.
మొదట కొరటాల శివ సిద్ధం చేసిన కథలో అనేక మార్పులు జరగడం కూడా ఆచార్య సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపింది.అయితే ఆచార్య సినిమా ఫ్లాప్ కాగా ఆ సినిమా నష్టాల భారం కూడా కొరటాల శివపై పడింది.
ఆచార్య సినిమాకు కొరటాల శివ రూపాయి కూడా రెమ్యునరేషన్ గా తీసుకోలేదు.
కొన్ని కారణాల వల్ల ఆచార్య సినిమా బిజినెస్ వ్యవహారాలను కొరటాల శివ చూసుకోవడంతో ఈ సినిమా నష్టాల భారం కూడా ఆయనపైనే పడిందని సమాచారం అందుతోంది.
మెగా హీరోలు కొంతమేర రెమ్యునరేషన్ ను వెనక్కిచ్చినా ఆ మొత్తం నష్టాలను భర్తీ చేయడానికి సరిపోలేదని తెలుస్తోంది.తాజాగా సీడెడ్ బయ్యర్లు కొరటాల శివ ఆఫీస్ లో ఇష్టానుసారం ప్రవర్తించడంతో జస్టిస్ ఫర్ కొరటాల శివ అనే హ్యాష్ ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతోంది.
మెగా హీరోలు కొరటాల శివను ఆదుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరి మెగా హీరోలు ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.కొరటాల శివపై ఆచార్య సినిమా వల్ల ఆర్థికంగా భారం పెరుగుతోంది.కొరటాల శివ ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.