సీనియర్లకు పోటీగా జూనియర్లు.. మరో యువజట్టు ఏర్పాటు అవ్వనుందా..?

ఐపీఎల్( IPL ) వేదికగా కొత్త కొత్త స్టార్లు పుట్టుకొస్తున్నారు.యువ ఆటగాళ్లకు తమ సత్తా ఏంటో చూపించేందుకు ఐపీఎల్ ఓ అద్భుతమైన ప్లాట్ ఫామ్.

 Juniors To Compete With Seniors Will Another Youth Team Be Formed , Ipl ,young P-TeluguStop.com

ఈ ఐపీఎల్ వేదికగా సీనియర్లకు ఏమాత్రం తీసుకోకుండా జూనియర్ ఆటగాళ్లు తమ అద్భుత ఆటను ప్రదర్శిస్తున్నారు.ఈ యువ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే.

ఇలాంటి ఆటగాళ్లే టీమిండియా జట్టులో సెలెక్ట్ కావాలని ఎవరికైనా అనిపిస్తుంది.ఈ ఐపీఎల్ లో తిలక్ వర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురేల్, యశస్వి జైస్వాల్, బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ లు అద్భుత ఆటను ప్రదర్శిస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే ఐపీఎల్ లో సత్తా చాటుతున్న యువ ప్లేయర్ ( young player )అందరికీ భారత జట్టులో అవకాశం రావడం అనేది కాస్త కష్టమే.ఒకవేళ వస్తే కొంతమందికి మాత్రం జింబాబ్వే లేదా వెండిస్ తో సిరీస్ లలో అవకాశం రావచ్చు.ఈ క్రమంలో క్రికెట్ ( Cricket )అభిమానులు బీసీసీఐకి రకరకాల సూచనలు చేస్తున్నారు.భారత్లో సీనియర్ టీం తో పాటు జూనియర్ టీం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రెండు టీంలు ఉంటే భారత్ తరపున పెద్ద ఈవెంట్స్ లో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు.

గతంలో బీసీసీఐ 2021లో ఒకే సమయంలో రెండు దేశాలతో సిరీస్ లను ఆడింది.కోహ్లీ( Kohli ) సారథ్యంలో టీమిండియా టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండుకు వెళ్తే.అదే సమయంలో దావత్( Dawat) సారథ్యంలో మరో భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం శ్రీలంకకు వెళ్ళింది.

ఈ ఐడియా సూపర్ సక్సెస్ అయ్యింది.కానీ ద్వైపాక్షిక సిరీస్ లకు ఇది చెల్లుబాటు అవుతుంది.

ప్రపంచ కప్ లాంటి టోర్నీలలో చెల్లుబాటు కాదు.ఎందుకంటే నిబంధనల ప్రకారం మెగా టోర్నీలలో ఒక దేశం తరఫున ఒక జట్టు మాత్రమే బరిలోకి దిగాలి.

కాబట్టి భవిష్యత్తులో ఈ నిబంధనను సడలిస్తే ఒక్కో దేశం నుంచి ఒకటికంటే ఎక్కువ టీమ్స్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.దీంతో సత్తా ఉన్న ఆటగాళ్లందరికీ అవకాశాలు దక్కుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube