తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల జోష్ కొనసాగుతోంది.ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశం అయ్యారు.
అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు అభివృద్ధి కోసం చాలా మంది బీఆర్ఎస్ లో చేరారన్నారు.కానీ పాలమూరు జిల్లాను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.తమ పార్టీలో చేరికలన్నీ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగమేనని తెలిపారు.2024 లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.తెలంగాణలో త్వరలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.