మార్కెట్లోకి 'JK టైర్స్' వచ్చేసాయి.. మీ వెహికల్ కి టైర్ మార్చాలని అనుకుంటున్నారా?

ప్రముఖ టైర్ తయారీ సంస్థ JK Tyres భారతీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాల కోసం సరికొత్త టైర్లను తీసుకు వచ్చింది.కరోనా తరువాత డీసెల్, పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

 Jk Tyres Launched New Range Of Radial Tyres For Electric Vehicles-TeluguStop.com

ఇలాంటి తరుణంలో JK Tyres ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనాల టైర్లను ఆవిష్కరించింది.కావున ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు, బైక్స్ మొదలైనవి ఈ టైర్లను వినియోగించవచ్చు.

ఈ ఆధునిక టైర్లను అత్యాధునిక గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ RPSCOE (రఘుపతి సింఘానియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) లోని ఇంజనీర్లు రూపిందించడం విశేషం.

వీటి ప్రత్యేకత ఏమంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ యొక్క ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ఈ టైర్లు రూపొందించ బడ్డాయి.

JK Tyres అల్ట్రా-లో రోలింగ్ రెసిస్టెన్స్, తడి మరియు పొడి ప్రదేశాల్లో కూడా మంచి పనితీరుని కనబరుస్తాయని చెబుతున్నారు.ఈ లేటెస్ట్ టైర్లు E-ట్రక్కులు, E-బస్, E-LCV, E-PV, E-SUV మరియు E-టూ వీలర్స్ వాహనాల డిమాండ్ పనితీరు అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి.

దాదాపు అన్ని టైర్స్ ట్యూబ్‌లెస్ అని సమాచారం.ప్రస్తుతం, JBM E-బస్సులకు EV రేంజ్ టైర్లు (255/70R22.5 మరియు 295/80R22.5) సరఫరా చేయబడుతున్నాయి.

Telugu Jk, Radial, Ups, Vehicles, Vk Vishra-General-Telugu

ఈ సందర్భంగా JK టైర్ అండ్ ఇండస్ట్రీస్ టెక్నికల్ డైరెక్టర్ అయినటువంటి VK మిశ్రా మాట్లాడుతూ.JK టైర్‌ కంపెనీ కస్టమర్ల అవసరాలను తీర్చడానికి మరియు పరిశ్రమల అవసరాలను తీర్చిదిద్దడానికి ఈ ఆధునిక టైర్లను విడుదల చేయడం జరిగింది అని అన్నారు.ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం పరుగులు తీసినవేళ మా కంపెనీ సేవలను వినియోగించుకోవాలని అన్నారు.అంతే కాకూండా కంపెనీ రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఆధునిక ఉత్పతులను మరిన్ని తయారు చేస్తుందని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube