కేవలం ఈ బ్యాండ్స్‌పైనే వర్క్ అయ్యో జియో 5జీ నెట్‌వర్క్..!

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ తన జియో 5జీ ఇంటర్నెట్ సేవలను ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి సిటీలలో ప్రారంభించిన విషయం తెలిసిందే.డిసెంబర్ 2023 నాటికి 5G సేవలను దేశమంతటా తీసుకొస్తామని జియో అధికారికంగా ప్రకటించింది.

 Jio 5g Network Works Only On These Bands Jio, Jio 5g, 5g Internet Service, 5g Mo-TeluguStop.com

అయితే ప్రస్తుతానికి ఈ అల్ట్రా స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ నాలుగు నగరాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ, అన్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌లు జియో 5జీ నెట్‌వర్క్‌కి కనెక్ట్ కాలేవు.లేటెస్ట్ టెక్ రిపోర్ట్స్ ప్రకారం, నిర్దిష్ట బ్యాండ్స్‌కి సపోర్ట్ చేసే 5జీ ఫోన్‌లలో మాత్రమే జియో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది.

రిలయన్స్ జియో యూజర్లు “em>MyJioయాప్, అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా వారి ప్రాంతంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి లేదో తెలుసుకోవచ్చు.అయితే, మీరు జియో ఇప్పటికే 5G సేవను ప్రారంభించిన నగరంలో నివసిస్తున్నట్లయితే.

ఇప్పటికీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయలేకపోతే, మీరు మీ ఫోన్ కంపెటిబిలిటీని చెక్ చేయాల్సి ఉంటుంది.జియో 5జీకి సపోర్ట్ చేసే 5G స్మార్ట్‌ఫోన్‌లతో పాటు జియో 5జీ సపోర్టెడ్ బ్యాండ్‌ల గురించి తెలుసుకోవడం ద్వారా కంపెటిబిలిటీని యూజర్లు చెక్ చేయవచ్చు.

Telugu Jio-Latest News - Telugu

ప్రస్తుతానికి, కేవలం మూడు బ్రాండ్లు మాత్రమే జియో 5జీకి సపోర్ట్ ఇస్తున్నాయి.అవేంటంటే, n28, n78, n258.మీ 5జీ స్మార్ట్‌ఫోన్ ఈ n28, n78, n258 బ్యాండ్స్‌కి సపోర్ట్ చేస్తున్నాయో లేదో చెక్ చేయడం ద్వారా మీరు ఈ విషయంలో స్పష్టత పొందొచ్చు.ఒక వేళ ఈ బ్యాండ్స్‌కి మీ ఫోన్ సపోర్ట్ చేయకపోతే మీరు జియో 5జీ సేవలు అందుకోలేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube