తెలుగు ప్రేక్షకులకు నటి మంచు లక్ష్మి గురించి వ్యతిరేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లతో ముచ్చటిస్తూ ఉంటుంది.
తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూ ఉంటుంది మంచు లక్ష్మి. అంతేకాకుండా తన ఫ్యామిలీకి తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ నే ఉంటుంది.
అలాగే అప్పుడప్పుడు కొన్ని ట్వీట్ ల ద్వారా సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఈమె ఇంస్టాగ్రామ్ లో తనకి తన కూతురికి సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ఎక్కువగా వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా మంచు లక్ష్మి తరచుగా ఏదో ఒక ఆసక్తికరమైనది లేదంటే ఫన్నీ పోస్ట్ లను చేస్తూ ఉంటుంది.తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ ని చేసింది.అందులో తాను నెలరోజుల తరవాత జిమ్‌కు వెళ్లానని, మోకాలి చీలికలో నొప్పి విపరీతంగా ఉందని చెబుతూ కళ్లు తేలేసి నాలుక బయటపెట్టి సోఫాలో పడిపోయి ఉన్నట్లు తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది లక్ష్మి.
అయితే స్థిరత్వం, సహనం ఉంటే ఏదో ఒక రోజు ఒకానొక టైమ్‌లో అనుకున్నది సాధిస్తామని ఈ పోస్ట్ ద్వారా మంచు లక్ష్మి తెలిపింది.

మంచు లక్ష్మి చెప్పిన కొటేషన్‌తో అలాగే ఆమె షేర్ చేసిన ఫొటో కూడా చాలా ఆసక్తికరంగా ఉండడంతో ఈ పోస్ట్ ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.కొందరు మంచు లక్ష్మికి అనుగుణంగా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం నెగటివ్ గా స్పందిస్తున్నారు.దీంతో పాటుగా ఈమె అప్పుడప్పుడు తన పప్పీతో కలిసి ఆడుకుంటూ మాట్లాడుతున్న వీడియోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.