తెలుగు మరియు తమిళంతో పాటు దేశ వ్యాప్తంగా స్టార్ డంను దక్కించుకున్న శ్రీదేవి మృతి చెందిన తర్వాత ఆమె వారసురాలు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.జాన్వీ బాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తోంది.
తెలుగులో ఈమెను హీరోయిన్‌గా నటింపజేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే జరిగాయి.కాని ఆమె కొన్ని కారణాల వల్ల సౌత్ సినిమాలకు నో చెబుతూ వచ్చింది.
తెలుగు సినిమాలకు నో చెప్పిన జాన్వీ కపూర్ త్వరలో ఒక తెలుగు సినిమా హిందీ రీమేక్ లో నటించబోతుంది.
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న విషయం తెల్సిందే.
అల్లు అర్జున్ పాత్రను బాలీవుడ్ ప్రముఖ హీరో పోషిస్తున్నాడు.ఇక పూజా హెగ్డే పాత్రను మొదట కియారా అద్వానీతో చేయించాలని భావించారు.
కాని ఆమె డేట్లు కుదరక పోవడంతో పాటు బడ్జెట్ విషయంలో కాస్త ఎక్కువగా ఉండటం వల్ల ఆ స్థానంలో జాన్వీ కపూర్‌ను తీసుకున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.

ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్‌ను నటింపజేసేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.అల వైకుంఠపురంలో హిందీ వర్షన్‌తో పాటు ఎన్టీఆర్ తో తెలుగులో కూడా నటిస్తే ఒకేసారి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఇక జాన్వీ కపూర్ తాజాగా నటించిన గుంజన్ సక్సెనా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.