డోంట్ వర్రీ మై జాన్.. అషూ రెడ్డిపై జెస్సీ ప్రేమ

బుల్లితెర ఆర్టిస్ట్ అషు రెడ్డి తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుందనే చెప్పాలి.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Jessie Supporting Ashu Reddy In Bigg Boss Non Stop Details, Jesse, Model, Bigg-TeluguStop.com

పైగా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అవకాశం అందుకుంది.ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను ఫిదా చేసింది.

చాలా వరకు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

అషు రెడ్డి డబ్స్మాష్ వీడియోలతో తొలిసారిగా నెటిజన్లను ఆకట్టుకుంది.

ఇందులో సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడి జూనియర్ సమంత అని పేరు సంపాదించుకుంది.అలా వెండితెరపై అవకాశం అందుకుంది.

అంతేకాకుండా బుల్లితెరలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని తన పరిచయాన్ని బాగా పెంచుకుంది.

ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.

విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈమె పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.

ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.

Telugu Ashu Reddy, Bigg Boss, Express Hari, Jaswanth Padala, Jesse, Rahul Siplig

ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది.ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.ఇక ప్రస్తుతం యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా చేస్తుంది.

కానీ అంతలోనే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.నిజానికి రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది అంటే తర్వాత తన పొజిషన్ ఏంటో క్లియర్ గా అర్ధం అవుతుంది.ఇదంతా పక్కన పెడితే అషు రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఉండటంతో బిగ్ బాస్ ప్రేక్షకులంతా తనకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు.

Telugu Ashu Reddy, Bigg Boss, Express Hari, Jaswanth Padala, Jesse, Rahul Siplig

పలువురు సెలబ్రెటీలు కూడా తనకు ఫుల్ సపోర్ట్ గా నిలిచారు.ఇక తన క్లోజ్ ఫ్రెండ్ జెస్సీ కూడా తనకు సపోర్ట్ చేస్తూ ఓ పోస్ట్ షేర్ చేశాడు.ఆ పోస్ట్ లో తను అషు రెడ్డి పై విపరీతమైన ప్రేమ చూపించాడు.ఇంతకు ఆ పోస్టులో ఏముందంటే.డోంట్ వర్రీ మై జాన్.నీకు మేము ఉన్నాం.

నువ్వు ధైర్యంగా ఉండు.నువ్వు నా పేరు చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను అని తెలిపాడు.

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కి లైకులు కొడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube