జనసేనలోకి జేడీ రీ ఎంట్రీ ? ఒకే ఒక్క కండిషన్ తో ? 

జనసేన పార్టీ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.రేపు, ఎల్లుండి పార్టీ కార్యక్రమాలతో ఇక్కడ హడావుడి చేసేందుకు పవన్ ఏపీలో అడుగు పెట్టబోతున్నారు.

 Jd Lakshmi Narayana To Join In Janasena Party, Jd Lakshinarayana In To Janasena,-TeluguStop.com

ఇక్కడే అనేక సంచలన నిర్ణయం తీసుకోవడంతో పాటు , రాజకీయంగా పార్టీని యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకోవడం వంటి పరిణామాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.కొద్ది రోజులుగా బీజేపీకి యాక్టివ్గా ఉండటం కలుపుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండటం , వంటి పరిణామాలతో ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే జనసేన పార్టీలో టూ ఎన్నికల్లో  పోటీ చేసి ఓటమి చెందిన మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఆ తరువాత పరిణామాల క్రమంలో పార్టీని వీడి బయటకు వచ్చేయడం ఇప్పుడు అనేక సేవా కార్యక్రమాలతో విశాఖలోని ఆయన బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు.

అయితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు అనే ఈ విషయంలో ఏ క్లారిటీ ఇవ్వకుండా, సైలెంట్ గానే ఉండిపోతున్నారు.కానీ, ఇప్పుడే జనసేన కు మళ్లీ అవకాశం దక్కే చాన్స్ కనిపిస్తుండటం , బిజెపి ప్రతి విషయంలోనూ పవన్ ను కలుపుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించటం,  ఏపీ బిజెపి వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్ ప్రతి విషయంలోనూ పవన్ ను కలుపుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండటం,

Telugu Cbi, Jagan, Janasena, Janasenani, Jd Lakshmi Yana, Mp Candi, Pawan, Pawan

అలాగే ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు యాక్టివ్ అవ్వడం ఇలా ఎన్నో పరిణామాలు లెక్కల్లోకి తీసుకుంటున్న జేడీ, మళ్లీ జనసేనలోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం లో ఉన్నారట.అయితే బిజేపి లో ఆయన చేరతారని హడావుడి నడిచినా జేడీ మాత్రం ఎందుకో ఆ పార్టీ వైపు వెళ్లేందుకు మాత్రం ఇష్ట పడడం లేదట.మళ్లీ జనసేన ద్వారానే  తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కానీ జనసేన ఆయన రీ-ఎంట్రీ ఇచ్చే విషయంలో ఓ కండిషన్ కూడా పెట్టినట్టు సమాచారం.

రాబోయే ఎన్నికల్లో తనకు తప్పనిసరిగా శాఖ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని, ఈ విషయంలో బీజేపీ ని ఒప్పించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ,  జేడీ జనసేనకు వర్తమానం పంపినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే జెడి రిక్వెస్ట్ జనసేనని నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube