జయలలిత కమిట్‌మెంట్ ఇదే.. ఒకే రోజు రెండు పనులు.. అర్ధరాత్రి వరకు షూటింగ్‌లో..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలితకు తమిళనాటే కాదు అంతటా అభిమానులు ఉన్నారు.

ఆమె ఒకపని అనుకుంటే చాలు అది పూర్తి చేసేంత వరకు నిద్రపోదు అని సినీ పరిశ్రమకు చెందిన వారు చెప్తుంటారు.

అటువంటి సంఘటన ఒకటి తెలుసుకుందాం.సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘కథానాయకుడు’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ చిత్రంలో కథానాయిక జయలలిత. కె.హేమాంబ‌ర‌ధ‌ర‌రావు ఈ ఫిల్మ్‌కు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు.సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరణ అయిపోయింది.

కానీ, ప్యాచ్ వర్క్ మిగిలిపోగా, అది చిత్రిస్తుండగా అనుకోని ఇబ్బంది ఎదురైంది.అదేంటంటే.

Advertisement

ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు ఎన్టీ రామారావు కాల్‌షీట్స్ అందుబాటులో ఉన్నాయి.అవి తప్పితే ఇక ఆరు నెలల వరకు ఆయన ఫుల్ బిజీగా ఉంటారని ప్రొడ్యూసర్, డైరెక్టర్‌కు తెలుసు.ఈ క్రమంలోనే ఫిబ్రవరి 3న తమిళనాడు మాజీ సీఎం డీఎంకే అధినేత అన్నాదురై చనిపోయారు.

ఆ టైంలో డీఎంకేలో ఎంజీఆర్ కీలకమైన వ్యక్తి.ఈ నేపథ్యంలోనే అన్నాదురై మృతితో విషాదంలో ఉంది జయలలిత.

‘కథానాయకుడు’ ప్యాచ్ వర్క్ షూట్‌కు హాజరయ్యే పరిస్థితులు లేవు.దీంతో ప్రొడ్యూసర్, డైరెక్టర్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

ఫిబ్రవరి 27 వ తేదీన సినిమా విడుదల గురించి ప్రకటన చేశారు.ఈ సందర్భంలో తమిళనాడులోని రాజాజీ హాలులో ఉన్న అన్నాదురై పార్థివ దేహాన్ని సందర్శించుకుని, టీ నగ‌ర్ నుంచి బీచ్ దాకా న‌డిచి వెళ్లి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు జయలలిత.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అనంతరం అదే రోజు అనగా ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్ర‌సాద్ స్టూడియోకి వ‌చ్చారు జ‌య‌ల‌లిత‌.జయలలిత కమిట్‌మెంట్ చూసి మూవీ యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారు.

Advertisement

ఇక సినిమా ప్యాచ్ వర్క్‌కు సంబంధించిన బిట్ సీన్స్ 52 రాత్రి 12 గంటల వరకు సినిమాటోగ్రఫర్ వి.ఎస్.ఆర్.స్వామి తీశారు.అలా ఆ రోజు షూటింగ్‌కు జయలలిత రావడం ఓ విశేషమైతే , చాలా స్పీడుగా బిట్ సీన్స్‌ను తీసి ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేశాడు స్వామి.

ఇక అనుకున్న టైంకు అనగా ఫిబ్రవరి 27న సినిమా విడుదలై సూపర్ సక్సెస్ అయింది.

తాజా వార్తలు