చెత్తబండి లాగుతూ ఐఏఎస్ దిశగా అడుగులు.. ఈ విద్యార్థిని కష్టానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

కొంతమంది కష్టాలు వింటే ఇంత కష్టపడి చదివే వాళ్లు కూడా ఉంటారా అని ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం.చెత్తబండి లాగుతున్న ఒక విద్యార్థిని చెత్తబండి లాగుతూ కూడా కెరీర్ పరంగా ఎదిగి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.

 Jayalakshmi Ghmc Garbage Collection Girl Inspiring Success Story Details, Jayala-TeluguStop.com

ఎదగాలని అనుకుంటే చెత్తబండి లాగుతూ కూడా కెరీర్ పరంగా ఎదగొచ్చని జయలక్ష్మి( Jayalaxmi ) ప్రూవ్ చేశారు.మూసారాంబాగ్( Moosarambagh ) సమీపంలో ఉన్న సలీం నగర్ లో పని చేస్తున్న జయలక్ష్మి కొన్నేళ్ల క్రితమే మురికివాడలోని పిల్లలకు ట్యూషన్లు చెప్పారు.

గాంధీ కింగ్ స్కాలర్లీ ఎక్స్ఛేంజ్ ఇన్నోషియేటివ్ లో( Gandhi-King Scholarly Exchange Initiative ) భాగంగా జూన్ లో అమెరికా వెళ్లి వచ్చిన జయలక్ష్మి తన సక్సెస్ స్టోరీతో ప్రశంసలు అందుకుంటున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఎంపిక కాగా ఆ ముగ్గురిలో అమెరికాకు( America ) వెళ్లడానికి ఎంపికైన వాళ్లలో జయలక్ష్మి ఒకరు.

పోరాడేతత్వం, పట్టుదల వల్లే తన లక్ష్యం నెరవేరిందని ఆమె చెప్పుకొచ్చారు.రాయలసీమ ప్రాంతానికి చెందిన జయలక్ష్మి తల్లీదండ్రులు వలస రావడంతో హైదరాబాద్ కు వచ్చారు.

Telugu America, Gandhischolarly, Garbage, Ghmc, Iasaspirant, Story, Jayalaxmi, M

జయలక్ష్మి తల్లీదండ్రులు చెత్తబండి నడుపుతూ( Garbage Collection ) జీవనం సాగించారు.జయలక్ష్మి మాట్లాడుతూ అమ్మ ఒక బండి, నాన్న ఒక బండి నడుపుతారని కాలనీ వాళ్లు నెలకు ఇంతని ఇచ్చే డబ్బులతో మేము జీవనం సాగిస్తానని ఆమె అన్నారు.గవర్నమెంట్ నుంచి మాకు జీతం రాదని చెత్త తీయడం చాలా కష్టమైన పని అని జయలక్ష్మి కామెంట్లు చేశారు.ఏడో తరగతి నుంచి నేను అమ్మకు తోడుగా వెళుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu America, Gandhischolarly, Garbage, Ghmc, Iasaspirant, Story, Jayalaxmi, M

మేము మంచిగా ఉద్యోగాలలో స్థిరపడాలని మా అమ్మ తపన అని జయలక్ష్మి కామెంట్లు చేశారు.స్లమ్స్ లో ఉండే పిల్లల వికాసం కోసం నేను పని చేశానని జయలక్ష్మి అన్నారు.ఇంగ్లీష్ మీడియంలో చదవాలని అనుకుని నేను నాలుగు కిలోమీటర్లు నడిచానని ఆమె తెలిపారు.కొంతమంది నన్ను చెత్త అమ్మాయి అని పిలుస్తారని లక్ష్యం లేని వారి బుర్రలే చెత్త అని జయలక్ష్మి కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube