చిన్న వయస్సులోనే ఐఏఎస్( IAS ) లక్ష్యాన్ని సాధించాలంటే సులువు కాదనే సంగతి తెలిసిందే.22 సంవత్సరాల వయస్సులోనే ఐఏఎస్ కావాలంటే రేయింబవళ్లు కష్టపడాలి.అయితే ఒక యువకుడు మాత్రం 22 సంవత్సరాల వయస్సులో ఐఏఎస్ కు ఎంపికై తన లక్ష్యాన్ని సాధించారు.పట్టుదల, కృషితో లక్ష్యాన్ని సాధించి తన సక్సెస్ తో ఈ యువకుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.
దేశంలోని అత్యున్నత స్థాయి పరీక్ష రాసి సక్సెస్ అయిన తెలుగబ్బాయి అశ్రిత్( ashrith ) తన సక్సెస్ స్టోరీకి సంబంధించిన కీలక విషయాలను చెప్పుకొచ్చారు.బిట్స్ పిలానీ క్యాంపస్( BITS Pilani Campus ) లో బీటెక్ చేశానని చదువు పూర్తైన వెంటనే ఆన్ లైన్ కోచింగ్ లో చేరానని అశ్రిత్ పేర్కొన్నారు.
నాలెడ్జ్ పెంచుకుని సివిల్స్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టానని అశ్రిత్ అన్నారు.నాకు వేగంగా రాసే అలవాటు ఉందని సివిల్స్ పరీక్ష మొత్తం రాస్తే సక్సెస్ అయినట్టేనని అశ్రిత్ తెలిపారు.

ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యే సమయంలో ఫ్రెండ్స్ కూడా సహాయసహకారాలు అందించారని నా లోపాలను వాళ్లు చెప్పడం కెరీర్ పరంగా ప్లస్ అయిందని అశ్రిత్ అన్నారు.రోజుకు ఎనిమిది గంటలు చదివానని పది రోజులకు ఒకరోజు సెలవు తీసుకుని ప్రిపేర్ అయ్యానని ఆయన కామెంట్లు చేశారు.ఏడాదిన్నర పాటు కష్టపడటం వల్ల సక్సెస్ దక్కిందని అశ్రిత్ వెల్లడించారు.

తెలుగు పాటలు, కంప్యూటర్ గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టమని అశ్రిత్ అన్నారు.యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీ ( UPSC Chairman Manoj Soni )నన్ను ఇంటర్వ్యూ చేశారని అశ్రిత్ వెల్లడించారు.చివరి వరకు నా ఇంటర్వ్యూ సాఫీగా సాగిందని అశ్రిత్ అన్నారు.
అశ్రిత్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.అశ్రిత్ సక్సెస్ స్టోరీ తమకు స్పూర్తిగా నిలిచిందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







