Vijayasaireddy YCP : ఈ నెల 7వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జయహో బీసీ మహా సభ

హాజరు కానున్న బీసీల ఆత్మబంధువు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.84 వేల మంది బీసీ ప్రతినిధులను సభకు ఆహ్వానించాం.వెనుకబడిన కులాలే వెన్నెముక.అన్న నినాదంతో మరింత ముందుకు.శ్రీ వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మా ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట బీసీలకు అధికారాలు లేవన్నది అసత్య ప్రచారమేఅట్టడుగు, అణగారిన వర్గాలకు ధైర్యాన్ని, భరోసాను ఇవ్వడానికే ఈ సభ మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణఈ నెల 7వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న “జయహో బీసీ మహా సభ” ఏర్పాట్లను పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా “జయహో బీసీ మహా సభ-వెనుకబడిన కులాలే వెన్నెముక.అన్న నినాదంతో” బీసీ మహా సభ పోస్టర్ ను పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు విడుదల చేశారు.

 jayaho Bc Maha Sabha Will Be Held At Indira Gandhi Municipal Stadium, Vijayawada-TeluguStop.com

దాదాపు 84 వేల మందికి పైగా బీసీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యే ఈ మహా సభను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి.విజయసాయిరెడ్డిగారు కోరారు.గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు వరకు ఆయా పదవుల్లో ఉన్న ప్రతి ఒక్క బీసీ ప్రజాప్రతినిధి తప్పనిసరిగా ఈ సభకు హాజరుకావాలని, ఒకవేళ ఎవరికైనా ఆహ్వానాలు అందకపోయినా, ఇదే ఆహ్వానంగా భావించి సభకు రావాలని విజయసాయిరెడ్డిగారు విజ్ఞప్తి చేశారు.

విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ.

ఇంకా ఏమన్నారంటే…వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జయహో బీసీ.పేరుతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో భారీ బీసీ మహాసభ నిర్వహిస్తోంది.

వెనుకబడిన వర్గాలే వెన్నెముక.అన్న నినాదంతో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారి ఆధ్వర్యంలో 7వ తేదీన మహాసభ జరుగుతుంది.ఈ మహాసభకు గ్రామ పంచాయితీల్లోని వార్డు సభ్యుల నుంచి ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న వారందరూ దాదాపు 84 వేల మంది బీసీ ప్రతినిధులు హాజరుకానున్నారు.7వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ మహాసభ ప్రారంభం అవుతుంది.12 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు హాజరై ప్రసంగిస్తారు.ఈ మూడున్నరేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది… రాబోయే కాలంలో ఏం చేయబోతుంది అనేది ముఖ్యమంత్రి గారు వివరిస్తారు.

అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ పదవులు పొందిన ప్రతి ఒక్క బీసీ ప్రతినిధులను ఈ సభకు ఆహ్వనిస్తున్నాం.ఈ సమావేశాల అనంతరం రీజనల్‌ స్థాయిలో జోనల్‌ సమావేశాలు కూడా నిర్వహిస్తాం.

ఆ తర్వాత జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, ప్రణాళిక బద్దంగా బీసీ సభలు నిర్వహిస్తాం.జ్యోతిరావుపూలే జయంతి కార్యక్రమం లోపల ఈ సమావేశాలన్నింటినీ పూర్తి చేయాలని నిర్ణయించాం.“బీసీలే వెన్నెముక” అన్న ప్రాతిపదికగా మా పార్టీ, ప్రభుత్వం ముందుకెళుతోంది.ఒక్క రాజ్యసభలోనే వైఎస్సార్సీపీ నుంచి 50 శాతం మంది సభ్యులు బీసీలే ఉన్నారు.

బీసీలకు రాజకీయంగా, సామాజికంగా అత్యున్నత స్థానం కల్పించిన పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.ఏ ఒక్క అసౌకర్యం లేకుండా జయహో బీసీ మహా సభను విజయవంతంగా నిర్వహిస్తాం.

అని విజయసాయిరెడ్డి గారు తెలిపారు.

శ్రీ బొత్స సత్యనారాయణ, మున్సిపల్‌ శాఖ మంత్రి:అధికారానికి ఒక ఆకారం ఉంటుందా.పదవులు పొందిన బీసీలకు అధికారాలు లేవన్న విమర్శలు హాస్యాస్పదం.అదంతా ఎల్లో మీడియా సృష్టే.ప్రతిపక్షాలు కూడా అలాంటి విమర్శలు చేయడం బీసీలను కించపరచినట్లే అవుతుంది.సమాజంలో అట్టడుగున ఉన్న, అణగారిన వర్గాలకు మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అండగా నిలిచారు.

ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వారికి మేమున్నాం అనే ధైర్యాన్ని, భరోసాను ఇవ్వడమే మా పార్టీ ప్రధాన లక్ష్యం.బీసీ మహాసభ తర్వాత ఎస్సీ, ఎస్టీల సభలు కూడా నిర్వహిస్తాం.

ఎవరినో విమర్శించడానికి ఈ బీసీ సభలు పెట్టడం లేదు.విమర్శలు చేసే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

రాష్ట్రంలోని ప్రతి ఒక్క బీసీ… వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాది అనే రీతిలో మేం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాశ్రీ జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రిఃబాబు ఇదేం ఖర్మ అని తిరుగుతుంటే.జనం చంద్రబాబుకు ఇదేం ఖర్మా.

అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.చంద్రబాబు ఖర్మ పట్టి తిరుగుతున్నాడు.84 వేల మంది బీసీ ప్రతినిధులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలో జయహో బీసీ అంటూ ఒక మహాసభ నిర్వహిస్తుంటే.టీడీపీ వెన్నులో వణుకుపుడుతుంది.

బీసీలను చంద్రబాబు అన్నివిధాలా ముంచాడు.జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేసి, సామాజిక న్యాయం చేస్తున్నారు.

ఈ సభలో గడిచిన మూడున్నరేళ్ళలో జగన్ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది.బీసీలకు ఏం చేస్తామని చెప్పాం.ఏం చేశాం.భవిష్యత్తులో ఇంకా ఏం చేయబోతున్నామో కూడా ఈ మహా సభలో చర్చిస్తారు.

ఒక వీరుడు, ధీరుడు, ధీశాలి.అయిన జగన్ మోహన్ రెడ్డిగారు, 75 ఏళ్ళ స్వాతంత్ర్య భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఎవరూ చేయని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, బలహీనవర్గాలను బలోపేతం చేస్తున్నారు.

ఈ నెల 7వ తేదీన విజయవాడలో ఉప్పెనలా బీసీ మహా సభ జరగబోతుంది.అని జోగి రమేష్ వివరించారు.

సభ ఏర్పాట్లను పరిశీలించినవారిలో మంత్రులు శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల్, శ్రీ కారుమూరి నాగేశ్వరరావు, ఎంపిలు శ్రీ మోపిదేవి వెంకటమణ, శ్రీమతి సత్యవతి, శ్రీ మార్గాని భారత్, ఎమ్మెల్యేలు శ్రీ కె.పార్థసారథి శ్రీ అదిప్ రాజ్, ఎమ్మెల్సీలు శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్రీమతి పోతుల సునీత, శ్రీ మురుగుడు హనుమంతరావు , శ్రీ లేళ్ల అప్పి రెడ్డి, విజయవాడ మేయర్ శ్రీమతి భాగ్యలక్ష్మి, ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ శ్రీ తలశిల రఘురాం, పార్టీ కార్యకర్తల సమన్వయకర్త శ్రీ పుత్తా ప్రతాప్ రెడ్డి, నవరత్నాల కమిటీ వైఎస్ ఛైర్మెన్ శ్రీ ఏ.నారాయణమూర్తి, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube