'జైలర్' మరో ఫీట్.. బాక్సాఫీస్ పై తాండవం చేస్తున్న సూపర్ స్టార్!

కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth )హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ( Nelson Dilipkumar )తెరకెక్కించిన భారీ యాక్షన్ మూవీ ”జైలర్”.( Jailer )ఆగస్టు 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

 Jailer Usa Box Office Collection Day 3, Rajinikanth , Jailer Movie, Nelson Dilip-TeluguStop.com

చాలా కాలంగా హిట్ లేక బాధ పడుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కు ‘జైలర్’ సినిమా ఊపిరి పోసింది అనే చెప్పాలి.రజనీకాంత్ కు బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

జైలర్ సినిమాకు సూపర్ స్టార్ రోల్ పెద్ద ప్లస్ అవ్వగా ఆయన పాత్రను చూపించిన తీరుతో నెల్సన్ కు ప్రసంసల వెల్లువ మొదలయ్యింది.ఇక ఈ సినిమా శివరాజ్ కుమార్( ShivaRajkumar ) రమ్యకృష్ణ కీలక రోల్స్ పోషించగా వీరు పాత్రలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి.సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించారు.

ఇవన్నీ కూడా సినిమాను ఎక్కడో నిలబెట్టాయి.

ఇప్పటికే రిలీజ్ అయ్యి మూడు రోజులు అవ్వడంతో అప్పుడే 100 కోట్ల మార్క్ చేరుకుంది.ఇక ఇండియాలోనే కాకుండా యూఎస్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.

అక్కడ కూడా రజనీకాంత్ తన హవా చూపిస్తున్నాడు.తాజాగా యూఎస్ మార్కెట్ లో జైలర్ మూవీ మరో మైల్ స్టోన్ దాటేసింది.

ఇప్పటికే ఈ సినిమా రెండు రోజుల్లో 2.25 మిలియన్ డాలర్స్ క్రాస్ చేయగా ఇప్పుడు మూడవ రోజు కలెక్షన్స్ తో 3 మిలియన్ మార్క్ క్రాస్ చేసినట్టు తెలుస్తుంది.మూడవ రోజు శనివారం యూఎస్ లో 8 లక్షల డాలర్స్ గ్రాస్ ను అందుకుని 4 రోజుల్లోనే 3.17 మిలియన్ డాలర్స్ రాబట్టింది.ఇదే ఊపు కొనసాగితే ఈ సినిమా కోలీవుడ్ నుండి ఆల్ టైం నెంబర్ 1 సినిమాగా నిలిచినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube