ఇంట్లో పనివాడిగా మారిన జగపతిబాబు.. నా పరిస్థితి చూడండంటూ ఆవేదన?

సీనియర్ నటుడు జగపతిబాబు( Jagapathi Babu ) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అప్పట్లో హీరోగా ఓ వెలుగు వెలిగాడు జగపతిబాబు.

 Jagapathi Babu Became A Worker At Home Is It Sad To See My Condition, Jagapathi-TeluguStop.com

తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాకుండా తన నటనకు పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.

చాలా వరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్( Family entertainment ) సినిమాలలో హీరోగా నటించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ తన పాత్రలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీగా ఉన్నాడు.తొలిసారిగా 1992లో అసాధ్యులు సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన జగపతి బాబు ఆ తర్వాత గాయం, జాబిలమ్మ పెళ్లి, దొంగాట వంటి సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకొని వెనుతిరగకుండా వరుస సినిమాలలో నటించాడు.

మధ్యలో కొన్ని ఏళ్ళు ఇండస్ట్రీకి దూరమైన జగపతిబాబు మళ్లీ రీ ఎంట్రీ తో వయసుకు తగ్గ పాత్రలనే కాకుండా విలన్ పాత్రల్లో కూడా నటించాడు.ఒక హీరోగానే కాకుండా హీరో హీరోయిన్స్( Hero heroines ) కు తండ్రిగా, విలన్ పాత్రగా కూడా జగపతి బాబు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారాడు.

విలన్ పాత్రతో కూడా అందర్నీ మెప్పిస్తూ వరుసగా అవే అవకాశాలు అందుకుంటున్నాడు.

ఇక ఇప్పటికీ జగపతిబాబు లుక్ ఏం మాత్రం మారలేదు.ఒకప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.అంతేకాకుండా ఈమధ్య బాగా వర్కౌట్లు కూడా చేస్తున్నాడు.

ఇక ఈయన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి బాగా పోస్ట్లు షేర్ చేస్తూ ఉన్నాడు.అప్పుడప్పుడు వంటలు చేసిన వీడియోస్ కూడా పంచుకుంటూ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు.

ఇక జిమ్ములో వర్కౌట్లు చేస్తున్న ఫోటోలను కూడా పంచుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు.నిజానికి జగపతిబాబు ఈ వయసులో ఇలా ఉన్నాడు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

కానీ హీరోగా కాకుండా విలన్ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా చేస్తూ బాగా బిజీగా మారాడు.

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సమయం దొరుకుతే ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేస్తూ ఉంటాడు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇన్స్టాగ్రామ్( Instagram ) లో ఒక ఫోటో పంచుకున్నాడు.అందులో తను తన ఇంట్లో చేతిలో ఇల్లు తుడిచే కర్ర పట్టుకొని నిలబడినట్లు కనిపించాడు.అయితే ఆ ఫోటో పంచుకుంటూ.అందరూ నేను ఏదో రాత్రి పగలు పని చేస్తున్నాను.తెగ సంపాదించేస్తున్నాను అనుకుంటున్నారు కదా? మరి ఈ ఫోటోలో నా పరిస్థితి ఎందుకో నెక్స్ట్ పోస్టులో చెప్తాను.మీరు ఈ లోపు గెస్ చేయండి అని పంచుకున్నాడు.ఇక ఆ ఫోటో చూసి జనాలంతా.అదేదో సినిమాకు సంబంధించింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి ఆ ఫోటో దేనికి సంబంధించిందో తెలియాలి అంటే తను పంచుకునే మరో పోస్ట్ వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube