ఏపీలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఇందులో భాగంగా జగనన్నకు చెబుదాం, గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధిహామీ పనులతో పాటు వ్యవసాయం -సాగునీరు విడుదల, జగనన్న భూ హక్కు, భూ రక్షపై సమావేశంలో చర్చించారు.
ఈ క్రమంలోనే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్షను తీసుకువస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.ఈ మేరకు ఈనెల 23 నుంచి జూలై 23 వరకు జగనన్న సురక్ష కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు.
ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు పాటించాలన్నారు.
జగనన్నకు చెబుదాంకు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సీఎం జగన్ తెలిపారు.
గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదులను తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించామో వాళ్ల ఇంటికి వెళ్లి వివరించాలని పేర్కొన్నారు.