రాయలసీమ ద్రోహిగా సీఎం జగన్ చరిత్రలో నిలుస్తారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు.రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం లేదన్న ఆయన ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవని తెలిపారు.వచ్చే నెలలో జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించి ప్రాజెక్టులను పరిశీలిస్తారని వెల్లడించారు.