ప్రాణం పోయేవరకు నీతోనే అంటూ ఇమ్మాన్యుయేల్ కు ప్రపోజ్ చేసిన వర్ష!

బుల్లితెర పై ఎన్నో క్రేజీ జంటలు ఉన్నాయి.ఆ క్రేజీ జంటలలో వర్ష, ఇమ్మాన్యుయేల్ జంట కూడా ఒకటి.

 Jabardasth Varsha Proposed To Immanuel , Jabardasth , Varsha , Emmuanuel , Propo-TeluguStop.com

బుల్లితెరపై సుదీర్, రష్మీ జంట తరువాత అంత పాపులారిటీ సంపాదించుకున్నారు ఈ జంట.ఇకపోతే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో లేడీ గెటప్ లో కంటే లేడీస్ ఏ ఎక్కువగా స్కిట్ లలో పాల్గొంటున్నారు.అయితే జబర్దస్త్ లో ఉన్న పలువురు కమెడియన్స్ కు రియల్ లైఫ్ లో కాకపోయినా, రీల్ లైఫ్ లో వాళ్లకు ఆన్ స్క్రీన్ జోడీలు కుదిరిన తర్వాత వాళ్ళ కెరీర్ కు మరింత రెక్కలు వచ్చాయి అని చెప్పవచ్చు.అలాంటి వారిలో సుడిగాలి సుదీర్, హైపర్ ఆది,ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.

ఇమ్మాన్యుయేల్ కీ వర్ష దగ్గర అయిన తర్వాత అతనికి మంచి గుర్తింపు దక్కింది.అంతేకాకుండా ఇప్పటికే పలు రకాల ఈవెంట్లలో ఈ జంట ఒకరిపై మరొకరు ప్రేమను వ్యక్త పరుస్తూ మరింత పాపులారిటీ సంపాదించు కుంటున్నారు.

గ్లామర్ పరంగా ఇద్దరికీ చాలా డిఫరెన్స్ ఉన్నప్పటికీ హిట్ పెయిర్ గా జబర్దస్త్ లో టాప్ పొజిషన్ లో ఈ జంట ఉంది.ఇదిలా ఉంటే త్వరలో వాలెంటెన్స్ డే రాబోతున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ సందర్భంగా అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.ఇక ఇందులో ఏకంగా స్టేజీపై ఇమ్మాన్యుయేల్ కీ ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేసింది వర్ష.

నా ప్రాణం పోయే వరకు నా హృదయంలో నువ్వు ఉంటావు అంటూ హార్ట్ సింబల్ తో ప్రపోజ్ చేసింది.

ఇక వర్ష ప్రపోజ్ చేయడంతో ఇమ్మాన్యుయేల్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.అనంతరం ఇమ్మాన్యుయేల్ కూడా ఒక డైలాగ్ చెప్పి ప్రపోజ్ చేశాడు.అందుకే అందరూ అంటుంటారు.

ప్రేమించడం కాదు.ప్రేమించబడటం గొప్ప అంటూ మోకాళ్లపై కూర్చుని.

నువ్వు నాకు దొరకడం నేను అదృష్టం గా ఫీల్ అవుతున్నాను అంటూ వర్షా కి ప్రపోజ్ చేశాడు ఇమ్మాన్యుయేల్.ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరి ఇది నిజంగానా, లేక ప్రోమో కోసమా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube